F3 Movie: ఎఫ్ 3 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఇక అప్ప‌టి నుండి న‌వ్వుల పండుగే..!

F3 Movie వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ 3 అనే చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు.

తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలవ్వడం ఖాయం అంటున్నాడు అనిల్. అంత బాగా స్క్రిప్ట్ వచ్చిందని.. లాక్ డౌన్ కావడంతో ఇంటి దగ్గరే కూర్చుని మరింత పక్కా స్క్రీన్ ప్లే రాసుకున్నామంటున్నాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా ఎఫ్ 3 కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతుంది.

ఎఫ్ 2 ఫ్రస్టేషన్స్ మీదే వెళ్లాడు అనిల్. కానీ మూడో భాగం మాత్రం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నాడు. ఇది ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేసాడు ఈ దర్శకుడు. అయితే కథ కూడా డబ్బుల చుట్టూనే తిరగనుంది. ఎఫ్ 2లో భర్తల ఫ్రస్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ భార్యలు చేసే పనులతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే కాన్సెప్టుతో ఎఫ్ 3 రానుందని ప్రచారం జరుగుతుంది.

సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, ఎట్ట‌కేల‌కు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. 2022, ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.