Bullet Bhaskar : జబర్దస్త్‌లో బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు మరో అడుగు ముందుకు!
NQ Staff - September 6, 2022 / 10:17 AM IST

Bullet Bhaskar : శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కోసం ఒకానొక సందర్భంలో చిన్న స్కిట్ కోసం బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు గారు కొన్ని నిమిషాలు కనిపించేందుకు స్టేజ్ ఎక్కారు. ఆయన టైమింగ్ మరియు ఆయన యొక్క ఇన్నోసెంట్ నటన అన్ని కలిసి ఇప్పుడు జబర్దస్త్ స్టార్ గా నిలబెట్టాయి.

Extra Jabardasth Latest Promo Bullet Bhaskar father Apparao lady getup
రెగ్యులర్ గా అప్పారావు గారికి జబర్దస్త్ స్టేజిపై అవకాశం దొరుకుతుంది. రోహిణి టీంలో అప్పారావు అనూహ్యంగా పర్మినెంట్ టీమ్ మెంబర్ అయిపోయాడు. రెగ్యులర్ గా రోహిణి మరియు ఆయన చేస్తున్న కామెడీ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
వచ్చే వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయిం. ఆ ప్రోమోలో అప్పారావును మరింత హైలెట్ చేస్తూ చూపించారు. మొదటి సారి అప్పారావు లేడీ గెటప్ లో కనిపించాడు. ఇప్పటి వరకు జబర్దస్త్ లో కమెడియన్స్ దాదాపు అందరూ కూడా లేడీ గెటప్ లో సందడి చేశారు.
మొదటిసారి అప్పారావు కూడా లేడీ గెటప్ వేయడంతో రష్మీ మొదలుకొని అంతా కూడా షాక్ అయ్యారు. ప్రోమోలో చూసిన ప్రేక్షకులు కూడా అవాక్కయ్యారు. ముసలోడే కాని మహానుభావుడు అన్న డైలాగ్ బాగా సూట్ అవుతుందని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
లేడీ గెటప్ లో అప్పారావు బాగున్నాడంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ముసలాయన అయిన అప్పారావు గారిని కూడా లేడీ గెటప్ లోకి మార్చేశారు కదా అంటూ కొందరు జబర్దస్త్ టీం పై విమర్శలు కురిపిస్తుంటే… మరి కొందరు మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన లేడీ గెటప్ వేసుకోవడం నిజంగా ఆయన యొక్క గొప్పతనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.