Ram Gopal Varma : ఆర్జీవీకి రూ.20 కోట్ల అప్పులున్నాయ్.. అందుకే కాంట్రవర్సీ సినిమాలు.. అసిస్టెంట్ వెంకటేశ్..!
NQ Staff - June 14, 2023 / 10:11 AM IST

Ram Gopal Varma : ఆర్జీవీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. ఒకప్పుడు మంచి సినిమాలు చేసే ఆయన.. ఇప్పుడు ఎక్కువగా కాంట్రవర్సీలు ఉండే సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ముఖ్యంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉండే సినిమాలు బాగానే చేస్తున్నాడని చెప్పుకోవాలి. అయితే తాజాగా ఆయన అసిస్టెంట్ వెంకటేశ్ సంచలన ఆరోపనలు చేశాడు.
గతంలో ఆర్జీవీ దగ్గర గార్లపాటి వెంకటేశ్ అసిస్టెంట్ గా పని చేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఆర్జీవీ తిక్క పనులు అన్నీ చేసి దాదాపు రూ.20 కోట్ల దాకా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడం కోసమే వైసీపీ నేతల దగ్గర పేమెంట్లు తీసుకుంటూ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. ఆర్జీవీ ఇలాంటి పేమెంట్లకు బాగా అలవాటు పడిపోయాడు.
అందుకే ఎవరు డబ్బులిచ్చినా అవతలి వారి మీద విషం కక్కుతున్నాడు. ఇదంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సమయంలోనే జరిగింది. ఆ సమయంలో కొందరు వైసీపీ నేతలు వచ్చి డీల్స్ మాట్లాడుకోవడం నేను కళ్లారా చూశాను. అప్పటి నుంచే నిజం లేకపోయినా సరే ఆర్జీవీ కావాలని చంద్రబాబును, పవన్ ను టార్గెట్ చేస్తున్నాడు.
కేవలం ఇదంతా తన అప్పులు తీర్చడం కోసమే చేస్తున్నాడు అంటూ ఆరోపించాడు వెంకటేశ్. ఆయన చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఆర్జీవీ ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పుడు జగన్ కు అనుకూలంగా ఓ సినిమా తీస్తున్నాడు ఆర్జీవీ.