Zombie Reddy: జాంబీ రెడ్డి స‌క్సెస్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ న‌యా ప్లాన్.. అక్కినేని కోడ‌లితో వైవిధ్య‌మైన చిత్రం

Zombie Reddy టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాలా చక్కగా ఎంటరై.. తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసి.. తెలుగునాట.. అచ్చమైన అక్కినేని వారింట కోడలిగా సెటిలై.. తన ప్రతిభతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. వాహ్వా అనిపించుకుంటున్న సూపర్ లేడీ సమంతా. తన అందం, ప్రతిభతో ఎలాంటి పాత్రలనైనా సునాయాశంగా నటిస్తూ.. కథలో బలమున్న పాత్రలను పోషిస్తూ ఎంతో పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ.

తన సినిమాలు కూడా అంతే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే లేటెస్ట్ గా అ!, కల్కి, జాంబిరెడ్డి సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సమంతా హీరోయిన్ గా సినిమా తెరకెక్కబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జాంబీస్ లాంటి కాన్సెప్ట్స్ తో సినిమా రావడం టాలీవుడ్ లో ఇదే మొదటిసారి. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ జాంబిరెడ్డికి సీక్వెల్ గా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కథ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సమంతా నటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో సమంతాతో చర్చలు కూడా ముగిశాయనేది ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.

ఇదిలా ఉండగా జాంబిరెడ్డి సినిమా ఫ్రిబవరి 5వ తేదిన విడుదలై మంచి టాక్ ని సంపాదించకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ ని వెంటనే తెరకెక్కించేలా సిద్దం చేస్తున్నారు ప్రొడ్యూసర్ లు. సమంతా ప్రజంట్ ఓ తమిళ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత గుణశేఖర్ డైరెక్షన్ లో శకుంతలం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకి సంబందించి టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్. సమంతా సినీ కెరీర్ లో ఇదొక మైలురాయిగా ఉండబోయేలా తీర్చిదిద్దుతున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క సీన్, కాస్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, సమంతా హీరోయిన్ రాబోయే సినిమా జాంబిరెడ్డి సీక్వెల్ కన్ఫామ్ అయితే ఆమె ఫ్యాన్స్ కు పండగే.

Advertisement