Regina : రెజీనా సినిమాల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

Regina : రెజీనా టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరసగా సినిమాలు చేసింది. ఆ సమయంలో తను నటించిన సినిమాలు మంచి హిట్ సాధించాయి. కానీ ఉన్నపలంగా కెరీర్ డౌన్ ఫాల్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నక్షత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో అమ్మడు జోరు బాగా తగ్గింది. అయితే టాలెంటెడ్ హీరో అడవి శేష్ తో చేసిన ఎవరు సినిమా ఈమెకి మంచి సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో రెజీనాకి మళ్ళీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

everyone will be shocked by regina-movie list
everyone will be shocked by regina-movie list

అయితే ఈమెకి తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం రావడం గొప్ప విషయం. యంగ్ హీరోలకి మంచి ఛాయిస్ అయిన రెజీనా ఏకంగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ సాంగ్ సినిమాలో చాలా స్పెషల్ గా ఉంటుందట. అంతేకాదు రెజీనా కెరీర్ కి ఈ సాంగ్ ప్లస్ అవుతుందని అంటున్నారు. కాగా ఇప్పుడు ఈమె 7 సినిమాలు చేస్తోంది. వాటిలో రెండు తెలుగు సినిమాలు కాగా నాలుగు తమిళ సినిమాలు.

Regina : రెజీనా నటిస్తున్న తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ అని తెలుస్తోంది. తెలుగులో ఇప్పటికే ‘నేనేనా’ సినిమా చేస్తున్న రెజీనా ‘మిడ్నైట్ రన్నర్స్’ అనే కొరియన్ సినిమా తెలుగు రీమేక్ లోనూ నటిస్తోంది. ఇందులో నివేథా థామస్ మరొక హీరోయిన్. సురేష్ బాబు నిర్మాత. అలాగే తమిళంలో పార్టీ, కళ్ళపార్ట్, కాసాడా తపరా, సూర్పాంగనై సినిమాలు చేస్తోంది. ఇప్పటికే సూర్పాంగనై సినిమా నుంచి రెజీనా లుక్ రిలీజై ఆకట్టుకుంది. అంతేకాదు తను నటిస్తున్న తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ చేయనున్నారు. 2022 వరకు ఈమె జోరు కొనసాగనుంది.