మాటల మాంత్రీకుడి మాటలకి ఫిదా అవుతున్న సినీ ఇండస్ట్రీ ..!
Vedha - January 13, 2021 / 05:00 PM IST

ఆయన మాటల్లో మ్యాజిక్… ఆయన కలం నుంచి జాలువారిన ప్రతిపదంలో మెసేజ్. ఎంతటివారినైనా సరే ఎమోషనల్ గా కట్టిపారేస్తారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోను ఆయన ఫుల్లీ ఎమోషనల్ అనే చెప్పాలి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మెసేజ్ ను ఆయన ద్వారానే చెబుతున్నారు. ఆయనే తెలుగు సినీ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.ఆయన డైలాగులకే కాదు మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతి కి రిలీజ్ కానున్న రెడ్ మూవీ కి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మాటల మాంత్రికుడు హైలెట్ అయ్యారు.
చీఫ్ గెస్ట్ గా హాజరైన త్రివిక్రమ్ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఎంతో ఎమోషనల్ గా అందరికి తెలిపారు. నిజంగా త్రివిక్రమ్ రియల్ లైఫ్ లోని సంఘటనల ఆధారంగానే సిసినిమాలోని డైలాగులను రాస్తాడనిపిస్తుంది త్రివిక్రమ్ మాటలు విన్న ప్రతిఒక్కరికి. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా క్రేజ్ ను సంపాదించుకున్న త్రివిక్రమ్ అణువంత అయినా అహంకారం లేక అందరి ముందు మీడియా ముఖంగా చెప్పాలనిపించిన విషయాన్ని చెప్పేశాడు.
హీరో రామ్ నటించిన మాస్ అండ్ క్లాస్ మూవీ రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రవికిశోర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను గుర్తు చేసుకుంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నా తప్పులేదంటూ ఎమోషనల్ అయ్యాడు త్రివిక్రమ్. ఈ ఈవెంట్ లో రవికిశోర్ కు ఆయనకు ఉన్న అనుబంధం గురించి ఎన్నో విషయాలను ప్రేక్షకుల తో షేర్ చేసుకున్నారు. స్వయంవరం సినిమా తో మంచి హిట్ సాధించినప్పటికీ ఆ తర్వాత తనకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చిన త్రివిక్రమ్.. రవికిశోర్ ఏ భీమవరం లో ఉన్న తనకు ఫోన్ చేసి మరి పిలిపించి నువ్వే కావాలి సినిమాకు కథ రచయితగా అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
ఈ నిర్మాతకి నాలుగు సినిమాలకు మాటలు రాసే అదృష్టం వచ్చిందని ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు. ఆయన లాంటి గొప్పవారి గురించి ఎంత చెప్పిన తక్కువ నాని ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించుకున్న ఎప్పటికి రవికిశోర్ గారికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపాడు త్రివిక్రమ్. ఈ సందర్భం ప్రతీ ఒక్కరిని కట్టిపడేసింది. అంతేకాదు త్రివిక్రమ్ మాటలకి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఫిదా అవుతోంది.