EMK: ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ఉన్న‌ట్టా, లేన‌ట్టా?.. ప్రోమోతో వ‌చ్చిన క్లారిటీ

EMK: విశ్వ‌విఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌ర‌మారావు న‌ట వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ డైన‌మైట్ ఎన్టీఆర్. చూడ‌డానికి సింపుల్‌గా ఉంటాడు కాని మేక‌ప్ వేసుకుంటే రికార్డులు తిర‌గ‌రాస్తాడు. వెండితెర‌పైనే కాదు బుల్లితెరపై కూడా చ‌రిత్ర సృష్టించారు జూనియ‌ర్ ఎన్టీఆర్.

Evaru meelo Koteeswaradu New promo
Evaru meelo Koteeswaradu New promo

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఇందులో కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు. ఇప్ప‌టికే తార‌క్ పాత్ర‌కు సంబంధించి లుక్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ .. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమా చేయ‌నున్నాడు.

బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో బుల్లితెర‌కు ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ కార్యక్ర‌మాన్ని ర‌క్తి క‌ట్టించాడు. హౌజ్‌మేట్స్‌తో క‌లిసి ఆయ‌న చేసిన సంద‌డి ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని పంచింది. తొలి సీజ‌న్‌ని అద్భుతంగా న‌డింపిచ‌డంతోనే త‌ర్వాతి సీజ‌న్స్‌పై తెలుగు ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తి పెరిగింది.

బిగ్ బాస్ సీజ‌న్ 1 త‌ర్వాత మిగ‌తా సీజ‌న్స్‌కు కూడా హోస్టింగ్ ఎన్టీఆర్ చేస్తాడ‌ని అంద‌రు ఊహించిన‌ప్ప‌టికీ అది జ‌ర‌గ‌లేదు. సినిమాల వ‌ల‌న కొన్నాళ్లు బుల్లితెరకు బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే కార్య‌క్ర‌మంతో తిరిగి ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేయ‌డంతో పాటు ప్రోమోలు కూడా విడుద‌ల చేశారు.

క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల‌న ఈ కార్య‌క్ర‌మానికి బ్రేక్ ప‌డింది. షోకు సంబంధించి ప్రోమోలు కూడా ఆగిపోయాయి. దీంతో కార్య‌క్ర‌మం ఎప్పుడు మొద‌లవుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అయితే ఎన్టీఆర్ రానున్న రోజుల‌లో వ‌రుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండ‌నున్న నేపథ్యంలో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మం చేయ‌డ‌ని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం సాగింది.

ఈ నేప‌థ్యంలో జెమినీ టీవీ ప్రోమో ద్వారా అన్ని రూమ‌ర్స్‌కు చెక్ పెట్టింది. తాజ‌గా విడుద‌లైన ప్రోమో ద్వారా త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని తెలిపింది. ‘EMK ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది. ఇటు చూస్తున్న వారికి వంద శాతం వినోదాన్ని అందజేస్తుంది​’అని పేర్కొంది. అయితే ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.