Manchu Manoj: మ‌నోజ్ ఆ రోజు లేక‌పోయి ఉంటే ఎంత గొడ‌వ‌లు అయి ఉండేవో: ప్ర‌భాక‌ర్

Manchu Manoj: ఎన్నికలు ముగిసినా ‘మా’లో వివాదాలు సర్దుమణిగినట్లు కనిపించడం లేదు. అంతా స‌ద్దుమ‌ణిగింది అనుకునే లోనే ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు ప్రెస్ మీట్ పెట్టి 11 మంది రాజీనామా చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, పోస్టల్‌ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Prabhakar Talks About Manchu Manoj on Maa Elections
ETV Prabhakar Talks About Manchu Manoj on Maa Elections

రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. మోహన్‌ బాబు ఎ‍న్నికల ప్రక్రియలోనే కూర్చున్నారు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్‌ నటుడిపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు.

మాలో ఎలాంటి చీలిక లేదు, కొత్త అసోసియేష‌న్ లేదు అని ప్ర‌కాశ్ రాజ్ అన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్‌లో బెన‌ర్జీ, త‌నీష్ జ‌రిగిన ప‌రిస్థితులు త‌ల‌చుకొని క‌న్నీరు పెట్టుకున్నారు. ఇక ప్ర‌భాక‌ర్ ఆ రోజు జ‌రిగిన ప‌రిస్థితుల గురించి తెలియ‌జేస్తూ.. ఆ రోజు మంచు మనోజ్ లేకుంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు.

ఎలక్షన్ రోజు మాత్రం మంచు మనోజ్, మంచు విష్ణు లేకుంటే మీరు చూసిన రచ్చ ఆఫ్ట్రాల్ అయి ఉండేది. హ్యాట్సాఫ్ టు మనోజ్.. మనోజ్ లేకుంటే కొట్టుకుని చచ్చేవాళ్లు. మనోజ్ చాలా కంట్రోల్ చేశారు. చాలా చాలా సూపర్ తమ్ముడూ.. మీరెప్పుడూ చల్లగా ఉండాలి. మన పర బేధం లేకుండా ఆ రోజు చేశారు.’ అంటూ మంచు మనోజ్‌పై నటుడు ప్రభాకర్ ప్రశంసల వర్షం కురిపించారు.

పదవులకు మాత్రమే తాము రాజీనామా చేస్తున్నామనీ, మా సభ్యత్వానికి కాదంటూ ఆయన తేల్చిచెప్పారు. మంచు విష్ణు సరిగ్గా పనిచేయకపోతే తాము నిలదీస్తామని ప్రభాకర్ స్పష్టం చేశారు.