Estheranil: ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారంటారు. దృశ్యం సినిమాలో చిన్నారిగా నటించిన ఎస్తర్ అనీల్ ఇప్పుడు చాలా పెద్దగా కావడమే కాకుండా అందాల ప్రదర్శన చేస్తూ అందరి మనసులు దోచుకుంటుంది.తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘దృశ్యం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నటి ఎస్తర్ అనిల్.. ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా ఎంతో క్యూట్‌గా కనిపించి ఆకట్టుకుంది.

ఎస్తర్ ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచింది. హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎస్తర్ అనీల్ మత్తెక్కించే అందాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

మాలీవుడ్ నుంచి వచ్చిన చాలామంది భామలు, టాలీవుడ్ కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేశారు. సమంత,అమలాపాల్, కీర్తిసురేష్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే అవుతుంది. ఇక తాజాగా ఈ లిస్ట్ లో చేరింది.. ఎస్తేర్ అనిల్. దృశ్యం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఎస్తేర్.. ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. మలయాళ యంగ్ హీరోల పక్కన నటించడానికి రెడీ అయిపోయింది.

దృశ్యం టైమ్ లో 12 ఏళ్ళ పాపగా ఉన్న ఎస్తేర్.. ఇఫ్పుడు దృశ్యం2 లో 20 ఏళ్ళ కాలేజి అమ్మాయిగా నటించింది. ఏడేళ్లకే ఎస్తేర్ లో ఇంత మార్పు చూసి.. అవాక్కవుతున్నారంత.. అంతే కాదు హీరోయిన్ గా పెద్ద అవకాశాల కోసం వెతుక్కుంటుంది ఎస్తేర్. అందుకోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగోడుతుంది. ఇండస్ట్రీకి తన బ్యూటీ ఘాటేమిటో చూపిస్తోంది ఎస్తేర్.. హాట్ చిక్ అనిపించుకోవడం కోసం తగ్గేదే లే అంటుంది.
- Advertisement -
