Esha Gupta: ఒక చెంప మీద కొడితే నేను రెండు చెంప‌లు వాయిస్తాను అంటున్న హాట్ బ్యూటీ

Esha Gupta: కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ రంగంపై కన్నేసిన హైవోల్టేజ్ సోయగం ఇషా గుప్తా. ఈ అమ్మ‌డు జన్నత్ మూవీతో నటిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయంతో తెగ హాట్స్‌ లుక్స్‌తో దర్శనమిస్తూ ఉంటుంది ఇషా.

Esha Gupta

‘ఏక్‌ బార్‌…ఏక్‌ బార్’ అంటూ ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్‌చరణ్‌తో స్టెప్పులేసిన ఈ భామ సోషల్‌ మీడియాలోనూ ఎంతో సందడి చేస్తుంటుంది. తన ఫ్యాషనబుల్‌, గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. ఇటీవ‌ల ఆమె కొన్ని టాప్ లెస్ ఫొటోలు షేర్ చేసింది. దీనిపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారు.

ఈ క్ర‌మంలో ఇషా స్పందిస్తూ.. ‘ కొన్నేళ్ల క్రితం వరకు సోషల్‌ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్‌ గురించి ఆలోచించి బాధపడేదాన్ని. అయితే ప్రస్తుతం అలాంటి ట్రోల్స్‌ గురించి పట్టించుకోవడం మానేశాను. వాటికి ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను’. ఇటీవల నేను పంచుకున్న ఫొటోలకు అసభ్యకర రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు.

అందుకే ఇప్పుడు నేను స్పందించక తప్పడం లేదు. చాలా మంది మేల్‌ యాక్టర్స్‌ షర్ట్‌ లేకుండా ఫొటోలు షేర్‌ చేస్తే ‘మీ బాడీ సూపర్బ్‌గా ఉంది’ అంటూ సానుకూలంగా కామెంట్‌ చేస్తారు. మరి వారిని ఎందుకు పూర్తి దుస్తులు ధరించమని చెప్పరు?’’ అని ప్రశ్నించింది. చీర ధరించి ఫొటో షేర్‌ చేస్తే…’ఈరోజు మీరు పూర్తి దుస్తులు ధరించారు’ అని వెటకారం చేస్తారు. మేకప్‌ ధరించిన ఫొటోలను పంచుకుంటే ‘ప్లాస్టిక్‌ బ్యూటీ’ అని కామెంట్లు పెడతారు.

మేకప్‌ లేని ఫొటోలను షేర్‌ చేస్తే ‘నువ్వు అందంగా లేవు. ముఖానికి మేకప్‌ వేసుకో’ అని సలహాలిస్తారు. ఇలా ఇండియాలోనే కాదు ప్రపంచంలో నలుమూలలా ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. మహిళలలకు సంబంధించి మన ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇక నా విషయానికొస్తే..నేను మానసికంగా ఎంతో బలవంతురాలిని. ఎవరైనా ఒకసారి నా చెంపమీద కొడితే నేను రెండుసార్లు వారి చెంపలు వాయిస్తాను’ అని ఘాటుగా చెప్పుకొచ్చింది.