RRR Movie : గ్లోబల్ స్టార్ బిరుదు వాడుకోని రామ్ చరణ్.. భయపడుతున్నాడా…?
NQ Staff - March 28, 2023 / 01:50 PM IST

RRR Movie : మన టాలీవుడ్ స్థాయి ఇప్పుడు బాగా పెరుగుతోంది. మన తెలుగు సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినిమాలుగా సత్తా చాటుతున్నాయి. దాంతో మన హీరోలు కూడా తమ బిరుదులను మార్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ కు నేషనల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ వచ్చింది. అలాగే అల్లు అర్జున్ కూడా బిరుదు మార్చుకున్నాడు.
పుష్ప సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ అయ్యాడు. అయితే ఇప్పుడు కొన్ని రోజులుగా రామ్ చరణ్ ను అంతా గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు. మెగా ఫ్యాన్స్ నుంచి మొదలు పెడితే సినీ ప్రముఖులు కూడా ఆయన్ను గ్లోబల్ స్టార్ అంటున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఆ బిరుదును వాడుకోవడానికి ధైర్యం చేయట్లేదు.
తాజాగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ పోస్టర్ లో రామ్ చరణ్ బిరుదును పాత పేరుతోనే చెప్పారు. మెగా పవర్ స్టార్ అనే బిరుదునే వేశారు. దాంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ బిరుదును వాడుకోవడానికి భయపడుతున్నాడని అంటున్నారు నెటిజన్లు.
ఆ క్రెడిట్ అతనికే..
ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళికే వెళ్లిపోయింది. రాజమౌళితో ఎవరు సినిమా చేసినా ఆ క్రెడిట్ హీరోలకు పెద్దగా రాదు. పైగా త్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ బిరుదును అందుకునే స్థాయి తనకు లేదని రామ్ చరణ్ కు కూడా తెలుసు. రాజమౌళి సినిమాతో కాకుండా ఇంకో సినిమాతో పెద్ద హిట్ కొడితే అప్పుడు ఆలోచంచొచ్చు.
ఎందుకంటే రాజమౌళి సినిమా తర్వాత ఆ రేంజ్ లో తన సినిమాలు ఆడుతాయో లేదో అనే భయం కూడా చరణ్ కు ఉంది. అందుకే ఇప్పుడు ఆ బిరుదును తీసుకోవడానికి రామ్ చరణ్ సిద్ధంగా లేడు. మరో రెండు సినిమాలు పెద్ద హిట్ అయితే అప్పుడు కచ్చితంగా వాడుకునే ఛాన్స్ ఉంది.