t20: టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్.. తొలుత బ్యాటింగ్ చేయ‌నున్న భార‌త్

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్ప‌టికే రెండు టీంలు చెరో మ్యాచ్ గెల‌వ‌గా, మూడో మ్యాచ్‌పై అంద‌రిలో ఆసక్తి నెల‌కొంది. ఈ మ్యాచ్ గెలిచి రెండు టీంలు సిరీస్‌పై ప‌ట్టు సాధించాల‌ని చూస్తున్నాయి. ఇక మొద‌టి రెండు టీ 20ల‌కు దూరంగా ఉన్న రోహిత్ శ‌ర్మ ఈ రోజు మ్యాచ్ ఆడ‌బోతున్నాడు. సూర్య కుమార్ యాద‌వ్ స్థానంలో రోహిత్‌ను తీసుకోగా, కేఎల్ రాహుల్‌తో క‌లిసి ఇన్నింగ్స్ ఆరంభించ‌నున్నాడు.

క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో నేటి మ్యాచ్ ఆడియ‌న్స్ లేకుండానే జ‌రుగుతుంది. మిగిలిన మ్యాచ్‌లన్నింటికి అభిమానులను స్టేడియంలోనికి అనుమతించడం లేదు. దీంతో ఆటగాళ్లు మరోసారి ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనున్నారు.ఇక శిఖర్‌ ధావన్‌ స్థానంలో అరంగేట్రం చేసిన ఇషాన్‌ కిషన్ రెండో టీ 20లో ఓపెన‌ర్‌గా వ‌చ్చి దూకుడైన ఆటతీరుతో కట్టిపడేయగా.. ఈ రోజు మ్యాచ్‌లో ఫ‌స్ట్ డౌన్ లో రానున్నాడు.

Advertisement