IPL 2021: ఐపీఎల్ నుండి త‌ప్పుకుంటున్న ఇంగ్లండ్ క్రికెట‌ర్స్.. ఎందుకో తెలుసా?

IPL 2021: క్రికెట్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించే సిరీస్ ఐపీఎల్ సెకండ్ ఫేజ్ మ‌రి కొద్ది రోజులలో ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే కొందరు ఆట‌గాళ్లు ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. తొలి దశలో 29 మ్యాచ్‌ల అనంతరం కోవిడ్ కలకలం రేగడంతో ఈ ఏడాది మే 4న ఐపీఎల్ 2021ని బీసీసీఐ అర్దాంతరంగా వాయిదా వేసింది.

England Cricketers Not want to Play in IPL 2021
England Cricketers Not want to Play in IPL 2021

యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండో దశతో పాటు టీ20 వరల్డ్ కప్ కూడా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 19న రెండో దశ ఐపీఎల్ జరుగనున్నది. అయితే కోవిడ్ ఆందోళనలు, ఇతర జట్లతో ద్వైపాక్షిక మ్యాచ్‌లు, గాయాల కారణంగా పలువురు ఆటగాళ్లు రెండో దశకు దూరమవుతున్నారు. వీరందరూ విదేశీ క్రికెటర్లే కావడం గమనార్హం.

డేవిడ్ మలన్, జానీ బెయిర్స్టో, క్రిస్ వోక్స్ ఐపీఎల్‌కి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు . లీగ్లో డేవిడ్ మలన్ పంజాబ్ కింగ్స్ తరుఫున ఆడుతుండగా.. జానీ బెయిర్ షో మన హైదరాబాద్ సన్ రైజర్స్ కు కీలక ఆటగాడిగా ఉన్నాడు. క్రిస్ వోక్స్ ఢిల్లీ క్యాపిటల్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ మలాన్ స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఐడెన్ మక్రామ్ని నియమించింది.

ఈ ముగ్గురు ఆటగాళ్లను నాలుగు నెలలకు పైగా ఇంటికి దూరం కాబోతున్నారు. వ‌రుస షెడ్యూల్స్ వ‌ల‌న వారు ఫ్యామిలీకి త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో దూరం కావ‌ల‌సి వ‌స్తుంది. టోర్నమెంట్లన్నింటిలోనూ వారు ఎల్లప్పుడూ బయో బబుల్లో ఉండాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన పని. ఫలితంగా వారు శారీరకంగా అలసిపోవడం ఖాయం. క్వారంటైన్ ఆంక్షల కారణంగా వారి మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు. కీలకమైన ఐసీసీ టీ20 యాషెస్ సిరీస్ ఉన్న కారణంగానే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరమైనట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఐపీఎల్ 2021లో 10 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రమే ఆడనున్నారు. వారు ఇయోన్ మోర్గాన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ ,సామ్ బిల్లింగ్స్, సామ్ కర్రాన్ ,టామ్ కర్రాన్ ,జార్జ్ గార్టన్ రెండో సగంలో ఆడ‌నున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని విదేశీ ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉండనున్నారు. టాప్ 4లో ఈ మూడు జట్లు ఉండటంతో వీరికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు.