ముద్దులు, హగ్గులతో రచ్చ.. ఇమాన్యుయేల్ చర్యలకు వర్ష షాక్.. వీడియో
NQ Staff - January 16, 2021 / 07:01 PM IST

జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్, పక్కింటి వారి విషయాలు, అమ్మాయిలు, మొగుడు పెళ్లాల వ్యవహారాలపై సెటైర్లు వేస్తూ స్కిట్లు వేస్తుంటారు. ఈ మధ్య జబర్దస్త్ వేదిక నుంచి ఇమాన్యుయేల్ వర్ష జోడి బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ డైరెక్షన్ టీం అంతా కూడా ఈ ఇద్దరి మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరికి ప్రోమోలో బాగానే స్కోప్ ఇస్తున్నారు.

emmanuel Hugs and kiss Varsha In Extra Jabardasth
వచ్చే వారానినికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. మొదటిసారిగా వర్ష, ఇమాన్యుయేల్ రిలేషన్‌ను మార్చారు. మామూలుగా లవర్స్, భగ్న ప్రేమికులు, కలవాలని తపించే ప్రేమికుల పాత్రలతో స్కిట్లు వేస్తుంటారు. తాజాగా ఇద్దరినీ తండ్రి కూతుళ్లుగా మార్చేశారు. ఈ దెబ్బతో ఇమాన్యుయెల్‌కు ఫ్రస్టేషన్ ఎక్కువైనట్టుంది. అలా ఫ్రస్టేట్ కావాలనే ఇలా వర్షకు తండ్రిగా మార్చినట్టున్నారు.
అయితే వర్ష పదే పదే నాన్న నాన్న అంటూ పిలవడంతో ఇమాన్యుయేల్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. రా అమ్మ అంటూ గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టేశాడు. మళ్లీ కూడా నాన్న అని అంటే దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టేశాడు. ఇలా ముద్దులు పెట్టేయడంతో వర్ష కూడా షాక్ అయింది. అలా ముద్దులు పెట్టడం కూడా రైటే అన్నట్టుగా రష్మీ కూడా ఇమాన్యుయేల్‌కు మద్దుతు తెలిపింది. ఇక రోజా సైతం తెగ నవ్వేసింది.