EMK: మ‌హేష్‌తో ఎన్టీఆర్ టాక్ షో.. ప్రోమో విడుద‌ల‌

EMK: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై తెగ ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే . ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా సాగుతుంది. ఈ షోకి కంటెస్టెంట్స్ గా, సామాన్యులతో పాటు అనేక మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు రావడం జరిగింది. రాజమౌళి, కొరటాల శివ, రామ్ చరణ్, సమంత తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు, ఎన్టీఆర్ షోకి హాజరై ప్రేక్షకులకు అనుభూతి పంచారు.

Evaru Meelo Koteeswarulu Special Episode - Promo
Evaru Meelo Koteeswarulu Special Episode – Promo

ఎవరు మీలో కోటీశ్వరులు షోకి గెస్ట్ గా మహేష్ వస్తున్నాడంటూ చాలా కాలంగా ప్రచారం అవుతుంది. దీని సంబంధించిన లీక్స్ కూడా రావడం జరిగింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ ని ఈ విషయంపై ప్రశ్నించగా… వాళ్ళు చెబుతారు, నన్నేమి అడగకండి అని సమాధానం చెప్పారు.

మ‌హేష్ తో ఎన్టీఆర్ ఎపిసోడ్ ఉంటుందని తెలిసినప్పటికీ, ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. రీసెంట్‌గా దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు.తాజాగా ప్రోమో విడుద‌ల చేయ‌గా ఇందులో ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకు ఫుల్‌ జోష్‌గా సమాధానాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ త్వరలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ప్రోగ్రామ్‌ టీమ్‌.. ఓ స్పెషల్‌ టీజర్ నెట్టింట్లో షేర్‌ చేసింది.

చివరిగా మహేష్ , ఎన్టీఆర్ ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిశారు. ఈ వేడుకలో మహేష్-ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఎన్టీఆర్ మహేష్ ని అన్న అని సంబోధిచడం, మహేష్ ఎన్టీఆర్ ని తమ్ముడు అనడం ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ కలిగించింది.

మరి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో, ఒకరినొకరు ఎలా అడ్రెస్ చేసుకుంటారో చూడాలి. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఎన్టీఆర్..ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌తో సంద‌డి చేస్తున్నారు.