mahesh: మ‌హేష్ ఎపిసోడ్‌తో ముగియ‌నున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు.. ప్రసారం ఎప్పుడో తెలుసా?

mahesh: ప్ర‌స్తుతం బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ క్విజ్ షో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు. ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్ర‌సారం అవుతున్న ఈ కార్యక్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఇక ఇదే షోను గతంలో నాగార్జున‌, చిరంజీవి ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ అంటూ మాటీవీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అదే షోను జెమినీ టీవీలో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ పేరుతో ప్రసారం అవుతోంది.

TheNewsQube-
emk shows ends with mahesh babu
emk shows ends with mahesh babu

 

ప్రేక్షకులకు మరింత వినోదం అందించే ఉద్ధేశ్యంలో భాగంగా షో నిర్వాహకులు మధ్య మధ్యలో పలువురు సినీ ప్రముఖులను షోలోకి గెస్టులుగా తీసుకొస్తున్నారు. ఈ షో ప్రారంభించిన మొదటి రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా తీసుకువచ్చారు. అంతేకాదు ఆయన షోలో ప్రశ్నలకు జవాబులు చెప్పి 25 లక్షలు గెలుచుకుని అదరగొట్టారు.

ఇక ఇటీవల తెలుగు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ గెస్ట్‌లుగా వచ్చి అలరించారు. ఆ త‌ర్వాత స‌మంత కూడా హాజ‌రైంది. మహేష్‌ బాబు ఎపిసోడ్‌ ను సీజన్ చివరి ఎపిసోడ్‌ గా టెలికాస్ట్‌ చేయాలని భావిస్తున్నారు. చివరి ఎపిసోడ్‌ కు మంచి రెస్పాన్స్ వస్తుందని నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

emk shows ends with mahesh babu
emk shows ends with mahesh babu

నవంబర్‌ 18 న ప్ర‌సారం కానున్న‌ఎపిసోడ్ తో షో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్‌ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. ఇప్పటికే మహేష్‌ బాబు తో ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్‌ చేసి నెల రోజులు దాటింది. మంచి సమయంలో ఈ ఎపిసోడ్‌ ను టెలికాస్ట్‌ చేస్తున్నారు