EMK: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్ లీక్… ఎన్టీఆర్ షోలో చ‌ర‌ణ్ ఎంత గెలిచాడంటే..!?

EMK: హిందీలో స‌క్సెస్ అయిన కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి షో ఇన్సిపిరేష‌న్‌తో తెలుగులో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు అనే కార్య‌క్ర‌మం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ షో తెలుగులో స‌క్సెస్‌ఫుల్‌గా నాలుగు ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా, ఐదో సీజ‌న్‌కి గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు జెమిని టీవీలో ప‌లు రకాల మార్పులతో జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా ఐదో సీజన్‌ను ప్రారంభించబోతున్నారు.

EMK Show First Episode Details Leaked
EMK Show First Episode Details Leaked

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు పేరుతో ప్రారంభం అవుతున్న ఈ కార్య‌క్ర‌మంకి సంబంధించిఇప్ప‌టికే 16 ఎపిసోడ్స్ పూర్తిచేసారట. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‏లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్‏తో కలిసి ఓ స్పెషల్ ఎపిసోడ్ కూడా షూట్ చేసారట.ఈ షూట్ పూర్తి కాగా, ఇందులో రామ్ చ‌ర‌ణ్ పాతి ల‌క్ష‌ల రూపాయ‌లు గెలుచుకున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ డబ్బులు మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది

ఎవరు మీలో కోటీశ్వరుడు క్విజ్ షో లో ప్రతీ సమాధానానికి ప్రైజ్ మనీ రెట్టింపు అవుతుందన్న సంగతి తెలిసిందే. చరణ్ తో షూట్ చేసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఆగస్టు 16న టెలికాస్ట్ చేయనున్నారట. ఆ తర్వాత సాధారణ కంటెస్టెంట్స్ పాల్గొన్న ఎపిసోడ్స్ ను ప్రసారం చేయనున్నారు.

సామాన్యుల షోగా పేరొందిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రోమోను ఆ మధ్య విడుదల చేశారు. ‘మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ‘‘ఎవరు మీలో కోటీశ్వరులు” త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి’ అంటూ వీడియో ద్వారా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ కారణంగా దీన్ని అనుకున్న టైమ్‌కు మొదలెట్టలేదు.

ఈ షో కోసం 60 ఎపిసోడ్స్ కు ఎన్టీఆర్ ఏకంగా రూ. 10 కోట్లు తీసుకుంటున్నట్లుగా జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్ప‌టికే బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెరపై సంద‌డి చేయ‌గా, ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంతో మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌బోతున్నాడు.