Bigg boss: ఈ సారి ఆమెకు మూడిన‌ట్టే.. ప‌క్కా ఎలిమినేట్ అవుతుందంటున్న నెటిజ‌న్స్

Bigg boss: బిగ్ బాస్ సీజ‌న్ 5 చివరి ద‌శకు చేరుకుంది. దీంతో పూర్తిగా లెక్క‌లు మారిపోతున్నాయి. గత వారం కాజల్ ఎలిమినేట్ అయినట్లే అనుకుంటూ ఉండగా జెస్సీ ఆరోగ్యం బాగాలేక పోవడం వల్ల ఆమె సేఫ్ అయ్యింది. జెస్సీ బయటకు వెళ్లి పోవడం వల్లే ఖచ్చితంగా కాజల్ సేవ్ అయ్యింది అనేది బిగ్ బాస్ విశ్లేషకుల మాట.

TheNewsQube-
elimination twist in bigg boss (1)
elimination twist in bigg boss (1)

అయితే ఈ వారం ర‌వి తప్ప హౌజ్మేట్స్ అందరు నామినేష‌న్స్‌లో ఉండ‌డంతో వీక్ కంటెస్టెంట్ ఒకరు ప‌క్కా ఎలిమినేట్ అవ్వ‌డం ఖాయం అంటున్నారు. అయితే వరుసగా ఎనిమిది తొమ్మిది వారాలు నామినేట్ అయ్యి సేవ్ అయిన రవి ఎట్టకేలకు కెప్టెన్ అవ్వడం వల్ల నామినేషన్ లో లేడు.

ఈ వారం నామినేషన్ లో షన్నూ.. కాజల్.. మానస్.. సిరి.. ప్రియాంక.. సన్నీ.. ఆనీ.. శ్రీరామ చంద్రలు ఉన్నారు. గత వారం నామినేషన్ లో లేకుండా ప్రియాంక మరియు ఆనీలు సేవ్ అయ్యారు. వీరిద్దరిలో ఎవరైనా నామినేషన్ లో ఉండి ఉంటే డేంజర్ జోన్ లో ఉండేవారు అనేది టాక్. ఇక ఈవారం డేంజర్ జోన్ లో కాజల్.. ఆనీ మరియు ప్రియాంకలు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

ఈ ముగ్గురు ఓట్ల పరంగా కాస్త తక్కువ దక్కించుకుంటున్నారట. ఇంతకు ముందు ఓట్ల శాతం చూస్తే ఈ వారంలో వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ఆనీ మాస్టర్ ను ఈ వారం బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఆనీ మాస్టర్ రెండు మూడు వారాల క్రితమే ఎలిమినేట్ అవ్వాల్సినా కూడా ఆమెకు స్పెషల్ పవర్.. కెప్టెన్సీ.. ఇమ్యూనిటీ దక్కిందని.. ఈసారి మాత్రం ఆమె ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటూ బుల్లి తెర విశ్లేషకులు అంటున్నారు. ఆమె ఒక వేళ లక్కీగా సేవ్ అయితే ప్రియాంక లేదా కాజల్ లో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడం పక్కా అంటున్నారు.

elimination twist in bigg boss1
elimination twist in bigg boss1

మొత్తంగా కాజల్.. ఆనీ మరియు ప్రియాంకల్లో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయం. కాజల్ ను కొందరు టార్గెట్ చేసి గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తుంటే.. ఆనీ మాత్రం పదే పదే కాజల్ ను టార్గెట్ చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.