Eesha Rebba: యువ‌రాణిలా కనిపిస్తున్న ఈషా.. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో తెలుగ‌మ్మాయి అదుర్స్

Eesha Rebba: లోక‌ల్ టాలెంట్‌ని ఎవ‌రు పెద్ద‌గా ప్రోత్స‌హించ‌రు అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్స్‌లొ చాలా మంది ప‌క్క రాష్ట్రం నుండి వ‌చ్చిన‌వారే . ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌గా ఉన్న‌పూజాహెగ్డే, ర‌ష్మిక‌, రాశీఖ‌న్నా,ర‌కుల్ వంటి భామ‌లు అంద‌రు ప‌క్క రాష్ట్రాల నుండి వ‌చ్చిన వారే. అయితే మ‌న తెలుగ‌మ్మాయిలకి అందం, అభిన‌యం ఉన్నా కూడా పెద్ద‌గా ఆఫ‌ర్స్ అందుకోలేక‌పోతున్నారు.

దాదాపు ఐదారేళ్లుగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హాట్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ఈషా రెబ్బా. అమీతుమీ, అ !, రాగాల 24 గంటల్లో, అరవింద సమేత లాంటి చిత్రాలలో తన నటనతో ఈషా రెబ్బా మెప్పించింది. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో మాయ చేసే ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ అభిమానుల మ‌న‌సు గెలుచుకుంటూ ఉంటుంది.

ట్రెండీ డ్రెస్ లలో త‌ర‌చుగా సంద‌డి చేసే ఈషా రెబ్బా ఇప్పుడు సాంప్రదాయ వస్త్రధారణలో క‌నిపించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది. ఈషా రెబ్బా తన అందంతో నెటిజన్లను కట్టి పడేస్తోంది. కలర్ ఫుల్ శారీ, ఆభరణాలతో యువ‌రాణిలా క‌నిపిస్తూ కేక పెట్టిస్తుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే సినిమా ద్వారా నటిగా పరిచయమైన ఈషా ఆ తర్వాత ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ప్రవేశించింది.

ఆరంభంలోనే తనలోని టాలెంట్లను నిరూపించుకున్న ఈషా రెబ్బాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె సుదీర్ఘ కెరీర్‌లో ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్ మొత్తంలో ‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘అమీతుమీ’ మాత్రమే విజయం సాధించాయి.