Eesha Rebba: శారీలో కిల్లింగ్ లుక్‌తో క‌నిపిస్తున్న తెలుగందం.. పిక్స్ హ‌ల్చ‌ల్

Eesha Rebba: తెలుగమ్మాయిల‌లో క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో కేక పెట్టించే అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. అంతకు ముందు ఆ తరువాత, అ, అర‌వింద స‌మేత‌ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్ లో హిట్స్ ఉన్నప్పటికీ సోలో హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అందరి లాగే తెలుగు హీరోయిన్ అన్న బ్రాండ్ కూడా ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది.

ఇటీవ‌ల‌ ‘పిట్ల కథలు’ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈషారెబ్బ త్వ‌ర‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో ప‌ల‌క‌రించ‌నుంది. తెలుగులోనే కాక ఇత‌ర భాష‌ల‌లోను స‌త్తా చాటాల‌ని ఈ ముద్దుగుమ్మ ప్ర‌య‌త్నిస్తుంది. ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు 9 ఏళ్ళు కావస్తుంది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు.

ఈషా రెబ్బా హాట్‌ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తూ, మేకర్స్ కి మతిపోగొడుతుంది. అవకాశాల విషయంలో తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తుంది. ఈ అమ్మ‌డు రెగ్యుల‌ర్‌గా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రెడిషనల్ లుక్ లో కూడా ఈషా కురాళ్ళ చూపు తిప్పుకోలేని విధంగా అందంతో ఆకర్షిస్తోంది.

తాజాగా ఈషా రెబ్బా చీర‌క‌ట్టులో కేక పెట్టిస్తుంది. చీర‌లో అయిన స్టైలిష్ డ్రెస్‌లో అయిన ఈషా రెబ్బా చించేస్తుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మ‌డికి మంచి ఆఫర్స్ రావాల‌ని తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో కోరుతున్నారు.