‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దు గుమ్మ ఈషా రెబ్బా. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన అందచందాలతో కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంటుంది. ఈషా నటించిన బందిపోటు, అమీతుమీ చిత్రాలు పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ, ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అ చిత్రంలో ఈషా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో హీరోయిన్ చెల్లెలిగాను ఈషా మంచి అభినయం కనబరిచింది. ప్రస్తుతం ఈషా రెబ్బా నటించిన పిట్టకథలు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, దీని ప్రమోషన్ కోసం ఈషా బాగానే కష్టపడుతుంది. తాజాగా ఈషా ఎల్లో డ్రెస్‌లో మతులు పోగొట్టేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.తెలుగు సోయగాన్ని ఇలా చూసిన నెటిజన్స్ మైమరిచి పోతున్నారు.