Eesha Rebba : ఈషా రెబ్బా అందాల‌కు మంత్ర ముగ్ధుల‌వుతున్న ఫ్యాన్స్

Eesha Rebba : తెలుగందం ఈషా రెబ్బా సినిమాల‌తో అంత‌గా అల‌రించ‌క‌పోయిన కూడా గ్లామ‌ర్‌షోతో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. 2012లో వచ్చిన ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంతో తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార ఈషా రెబ్బా. ఈ సినిమాలో ఈషాకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా రెండో చిత్రంతోనే హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది.

Eesha Rebba cute photo shoot
Eesha Rebba cute photo shoot

‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్‌గా మారిన ఈ చిన్నది తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఈషా రూపంలో తెలుగు ఇండస్ట్రీకి మరో తెలుగు హీరోయిన్‌ లభించింది. ఇక ‘అమీతుమి’, ‘అ!’ వంటి చిత్రాల్లో నటించిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది.

Eesha Rebba cute photo shoot
Eesha Rebba cute photo shoot

ఇక అరవింద సమేతతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘పిట్ట కథలు’, ఆహా వేదికగా విడుదలైన ‘త్రీ రోజెస్‌’తో వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది ఈషా. ఈ రెండు వెబ్‌ సిరీస్‌ల్లోనూ వైవిధ్యమైన పాత్రలో నటించిన ఈషా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై కూడా తనదైన ముద్ర వేసింది.

Eesha Rebba cute photo shoot
Eesha Rebba cute photo shoot

కేవ‌లం తెలుగులోనే కాదు ఇత‌ర భాష‌ల‌లోను ఈ అమ్మ‌డు స‌త్తా చాటుతుంటుంది. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈషా రెబ్బా తాజాగా చూడీదార్ డ్రెస్‌లో మ‌తులు పోగొడుతుంది. అమ్మ‌డి అంద‌చందాల‌కు అంద‌రు మంత్ర ముగ్ధుల‌వుతున్నారు.

ఇటీవ‌ల ఈషా ‘నా తొలి మలయాళ సినిమా చిత్రీకరణ నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది’ అని ట్వీట్ చేసింది. మరి మలయాళంలో ఈషాకు ఎలాంటి ఫేమ్‌ వస్తుందో చూడాలి.

ఇక తెలుగులో అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలోనే ఈషాకు మలయాళ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే ఈషా ‘ఒట్టు’ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అరవింద్‌ స్వామి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ఈషా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించింది.

ఇక తాజాగా చిత్ర షూటింగ్ ముగిసిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఈషా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నా తొలి మలయాళ సినిమా చిత్రీకరణ నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది’ అని ట్వీట్ చేసింది. మరి మలయాళంలో ఈషాకు ఎలాంటి ఫేమ్‌ వస్తుందో చూడాలి.