ఆఫ్రికాకు న‌గ‌దు ఎందుకు పంపారు.. పూరీపై ప‌దిగంట‌ల పాటు ప్ర‌శ్న‌ల వ‌ర్షం

Drugs Case: టాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని మంగ‌ళ‌వారం నుండి ఈడీ విచారిస్తున్న‌ విష‌యం తెలిసిందే.తొలుత ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు ఆయ‌న‌ను ప‌దిగంట‌ల పాటు విచారించిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ విచార‌ణ‌లో అనేక ప్ర‌శ్న‌లు వేసిన‌ట్టు స‌మాచారం. విదేశాలకు బదిలీ అయిన నగదు సినిమా షూటింగ్‌లకు చెందినదని పూరీ వివరణ ఇచ్చారు.

ED Questions Tollywood Director Puri Jagannadh For 10 Hours
ED Questions Tollywood Director Puri Jagannadh For 10 Hours

ఏయే సినిమాల‌కు సంబంధించి న‌గ‌దు పంపారో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఈడీ కోరింది. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అంద‌జేస్తార‌ని పూరీ పేర్కొన్నారు. ఇక ముగ్గురు ఆఫ్రికా డ్రగ్‌ పెడలర్ల ఫొటోలను ఈడీ అధికారులు పూరీకి చూపించి వారెవరో తెలుసా? అని ప్రశ్నించారు. తనకు తెలియదని పూరీ సమాధానమిచ్చారు.

ED Questions Tollywood Director Puri Jagannadh For 10 Hours
ED Questions Tollywood Director Puri Jagannadh For 10 Hours

2017 జూలైలో డ్రగ్‌ పెడలర్‌ కెల్విన్‌ను ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయ‌న వాట్సాప్ చాట్ ఆధారంగా సినీరంగానికి సంబంధించి12 మందిని పిలిపించి విచారించారు. ఈ కేసులో మనీ లాండరింగ్‌ కోణం ఉండడంతో ఇప్పటికే కెల్విన్‌ తదితరులను విచారించిన ఈడీ.. ఆ 12 మంది విచారణకు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా, తొలిరోజు మంగళవారం ఉదయం 10.15 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్‌ చేరుకున్నారు. ఆయన వెంట కుమారుడు ఆకాశ్‌ పూరి, చార్టెడ్‌ అకౌంటెంట్‌ శ్రీధర్‌ ఉన్నారు.

మ‌నీలాండ‌రింగ్ కేసులో భాగంగా పూరీని విచారించ‌గా, ఆయ‌న‌ను దాదాపు ప‌ది గంట‌ల పాటు ప్ర‌శ్నించిన‌ట్టు తెలుస్తుంది. విచారణకు ముందే.. పూరీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు రెండు లావాదేవీల్లో భారీగా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. ఇద్దరు ఆఫ్రికన్ల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు ఆధారాలు సమర్పించింది. కాగా, టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో గురువారం ఈడీ ఎదుట చార్మి కౌర్‌ విచారణకు హాజరు కానున్నారు.

పూరీ జ‌గ‌న్నాథ్ విచార‌ణ స‌మ‌యంలో బండ్ల గ‌ణేష్ ఈడీ కార్యాల‌యానికి హాజ‌రు కావ‌డం అందరిలో అనేక అనుమానాలు క‌లిగించింది. కేసు విచార‌ణ‌లో భాగంగానే బండ్ల గ‌ణేష్ వ‌చ్చాడ‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌గా, దానిపై స్పందించిన బండ్ల‌.. ‘‘నేను పూరీ జగన్నాథ్‌ కోసం వచ్చా. నాకెవరూ నోటీసులు ఇవ్వలేదు’’ అని ఆయన చెప్పారు. అయితే, పూరీతో కలిసి బండ్ల గణేశ్‌ రెండు సినిమాలు తీసినందున ఈడీ ఆయననూ పిలిపించిందంటూ ప్రచారం జరిగింది.