Unstoppable Talk Show : రామ్‌చరణ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్.! జూనియర్ ఎన్టీయార్ సంగతేంటి.?
NQ Staff - December 30, 2022 / 01:10 PM IST

Unstoppable Talk Show : ‘ఎప్పుడొస్తున్నావ్ అన్‌స్టాపబుల్‌కి.?’ అంటూ నందమూరి బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని ఫోన్‌లో ప్రశ్నించాడు. ప్రభాస్‌తో అన్‌స్టాపబుల్ టాక్ షో సందర్భంగా, ప్రభాస్ ఫోన్ నుంచి రామ్ చరణ్‌తో బాలకృష్ణ మాట్లాడారు.
కాగా, ‘పిలుపు దూరంలో వున్నానంతే.. వచ్చేస్తా నేను కూడా..’ అని రామ్ చరణ్, అన్‌స్టాపబుల్ టాక్ షోకి రావడంపై బాలకృష్ణతో చెప్పాడు.
రామ్ చరణ్ సరే.. ఎన్టీయార్ ఎప్పుడు.?
ఆ మధ్య త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడి పవన్ కళ్యాణ్‌తో అన్‌స్టాపబుల్ టాక్ షో ఫిక్స్ చేసిన బాలయ్య, ప్రభాస్ ద్వారా రామ్ చరణ్‌తో ఫోన్‌లో మాట్లాడి, యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా రప్పించేస్తాడేమో.! అంటే ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు అన్‌స్టాపబుల్ టాక్ షోలో త్వరలో కనిపిస్తారన్నమాట.
ఇదిలా వుంటే, తన సినిమా ‘వీర సింహా రెడ్డి’ని సంక్రాంతికి మొదటగా చూడాలనీ, ఆ తర్వాతే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని చూడాలనీ రామ్ చరణ్‌తో బాలయ్య చెప్పడం గమనార్హం. ‘నా సినిమా ముందు చూడు.. ఆ తర్వాత మీ నాన్నగారి సినిమా చూడాలి..’ అని చెప్పారు బాలయ్య, రామ్ చరణ్‌తో.