Sunitha : ఈ వయసులో పెళ్లి ఏంటి అన్నారు… సునీత చాలా సీరియస్ వ్యాఖ్యలు
NQ Staff - September 19, 2022 / 08:39 PM IST

Sunitha : సాధారణంగా సింగర్స్ కి ఒక మోస్తరు గుర్తింపు మాత్రమే ఉంటుంది.. కానీ తెలుగులో కొందరు సింగర్స్ కి హీరోయిన్స్ స్థాయి గుర్తింపు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో సింగర్ సునీత మొదటి వరుసలో ఉంటారు.
ఈమెకు ఏకంగా హీరోయిన్
అవకాశాలు కూడా గతంలో వచ్చాయి అనేది టాక్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆఫర్లు వస్తున్నాయి. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా సింగర్ సునీత నటనకు దూరంగానే ఉంటున్నారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరియు సింగర్ గా కొన్ని వందల సినిమాలకు పని చేసిన సునీత ఈ మధ్య కాలంలో తెగ వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా ఆమె రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా అదే విషయమై వార్తల్లో నిలుస్తున్నారు.

During Sunitha Second Marriage Many People Trolled Her In Ways
ఆమె రెండో పెళ్లి సమయంలో చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు. ఈ వయసులో పెళ్లి ఏంటి? పిల్లలకు పెళ్లి చేయాల్సిన వయసులో పెళ్లి ఏంటి? ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటున్నావా అంటూ రకరకాలుగా తీవ్ర విమర్శలు చేశారు.
ఆ విమర్శలపై సునీత ఆ సమయంలో పెద్ద స్పందించలేదు.. కానీ తాజాగా ఇంటర్వ్యూలో సునీత చాలా ఘాటుగా స్పందించింది. తన వ్యక్తిగత విషయం గురించి ఇతరులకు ఏం అవసరం అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.
గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయి సీరియస్ గా సునీత తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చిందే లేదు. మొదటి సారి సునీత కాస్త సీరియస్ గా ట్రోల్స్ కి సమాధానం ఇవ్వడంతో ఆ ఇంటర్వ్యూ చాలా వైరల్ అవుతుంది.
అదే ఇంటర్వ్యూలో సునీత తనయుడు కూడా ప్రత్యక్షమవడంతో మరింత వైరల్ గా ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముందు ముందు కూడా సునీత నటించే అవకాశం లేదని కుండ బద్దలు కొట్టేసింది.