RAPO19: రామ్ 19వ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌.. ఇక దుమ్ము రేగ‌డం ఖాయం !

ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన రామ్ పోతినేని ఇటీవ‌ల రెడ్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇందులో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించి అల‌రించాడు. ఇందులో రామ్ న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక ఇటీవ‌ల త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో బైలింగ్యువ‌ల్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారని.. తెలుగు, తమిళ భాషల్లో ప్యారలల్‌గా ఈ సినిమాను రూపొందించనున్నామని ఆయన పేర్కొన్నారు.

రామ్ 19వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ ఎవ‌రు అందిస్తార‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొన‌గా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ చిత్ర బృందంతో క‌లిసాడు. కొద్ది సేప‌టి క్రితం ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఇక దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతానికి రామ్ స్టెప్పులు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిత్రంలో రామ్ మేకొవ‌ర్ కొత్త‌గా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీని హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్నారు. ప్ర‌స్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Advertisement