Drushyam2 Review: ‘దృశ్యం 2’ రివ్యూ

Drushyam2 Review: మలయాళంలో సూపర్‌ హిట్ అయిన మోహన్ లాల్ దృశ్యంను తెలుగు లో వెంకటేష్ 2014 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది మలయాళంలో దృశ్యం 2 వచ్చింది. సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్దం చేశారు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా సాధ్యం కాలేదు. దాంతో దృశ్యం 2 ను మలయాళ వర్షన్ మాదిరిగానే తెలుగు వర్షన్ ను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Venkatesh meena Drushyam 2 Review
Venkatesh meena Drushyam 2 Review

కథ :

దృశ్యం కథకు కొనసాగింపుగా ఈ సినిమా ఉంటుంది. వరుణ్‌ మృతి తర్వాత రాంబాబు ఫ్యామిలీ లో ఏళ్లు గడుస్తున్నా అలజడి కొనసాగుతూనే ఉంటుంది. శవంను పోలీస్‌ స్టేషన్‌ లో పూడ్చిన రాంబాబు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పోలీసులు మళ్లీ వస్తారని.. వరుణ్‌ అస్థిపంజరంను తీస్తారని ఊహించి అన్ని సంవత్సరాలు అందుకోసం సిద్దం అవుతూనే ఉంటాడు. సినిమా చేసే ఉద్దేశ్యం లేకుండానే ఒక రచయితను కలిసి కథను చర్చిస్తూ ఉంటాడు. ఆ కథ ను నవలగా తీసుకు వస్తాడు. అలా తన కథను తానే నవల రాసుకున్నాడు. అయితే అది తాను రాసింది కాదన్నట్లుగా అన్ని సాక్ష్యాలను సృష్టించాడు. అనుకున్నట్లుగానే పోలీసులకు వరుణ్‌ డెడ్ బాడీ పోలీస్ స్టేషన్ లో ఉందని తెలుస్తుంది. అప్పుడు పోలీసులు ఏం చేస్తారు.. పోలీసుల ఎత్తులకు రాంబాబు పై ఎత్తులు ఏంటీ అనేది సినిమా కథ.

Drushyam2 Telugu Movie Review and Rating
Drushyam2 Telugu Movie Review and Rating

నటీ నటుల పర్‌ఫార్మెన్స్ :

వెంకటేష్‌ మరోసారి రాంబాబు పాత్రలో జీవించేశాడు. ఒక మద్య తరగతి వ్యక్తి తన కుటుంబంకు ఇచ్చే ప్రాముఖ్యత.. తన కుటుంబం కోసం పడే తాపత్రయంను వెంకటేష్‌ చక్కగా చూపించాడు. అద్బుతమైన తన నటనతో ఒరిజినల్ వర్షన్ లో మోహన్‌ లాల్ మాదిరిగానే ఆకట్టుకున్నాడు. తెలుగు ప్రేక్షకులు మరోసారి రాంబాబు పోరాటంకు ఫిదా అవ్వడంలో సందేహం లేదు. అమాయకురాలైన గృహిణి పాత్రలో మీనా నటించి మెప్పించింది. ఒరిజినల్ వర్షన్‌ లో కూడా ఆమె నటించింది కనుక ఇక్కడ కూడా పాత్రను జీవించేసింది. నదియా మరియు నరేష్‌ లు కూడా మెప్పించారు. ఇక సినిమాలో నటించిన ఇతర నటీ నటులు వారి పాత్రలకు తగ్గట్లుగా నటించి మెప్పించారు.

టెక్నికల్‌ :

ఒరిజినల్ వర్షన్‌ కు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయన మొదటి పార్ట్ కు సంబంధించిన విషయాలను గుర్తు చేస్తూ కథలోకి తీసుకు వెళ్లిన విధానం బాగుంది. రాంబాబు తన కుటుంబం కోసం పడే తాపత్రయంను అద్బుతంగా చూపించాడు. ప్రతి సన్నివేశంలో కూడా దర్శకుడి ప్రతిభ కనిపించింది. ఇక నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. అలాగే సినిమాటో గ్రపీ కూడా కథనంకు తగ్గట్లుగా సరిగ్గా సెట్‌ అయ్యింది. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు మినహా అంతా బాగానే ఉంది. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

Drushyam2 Telugu Movie Review and Rating
Drushyam2 Telugu Movie Review and Rating

ప్లస్ పాయింట్స్ :

  • వెంకటేష్‌ నటన,
  • కథలో సస్పెన్స్‌,
  • నేపథ్య సంగీతం.

మైనస్ పాయింట్స్ :

  • స్లో కథనం,
  • కొన్ని సన్నివేశాల్లో మిస్ అయిన లాజిక్‌

విశ్లేషణ :

మద్యతరగతి తండ్రి తన పిల్లల కోసం ఏం చేసేందుకైనా.. ఎంతకైనా తెగిస్తాడని మరోసారి ఈ సినిమాలో చూపించాడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగానే ఊహించుకుని దానికి రెడీ అవ్వడం అనేది కాస్త నాచురాలిటీకి దూరంగా ఉన్నా సినిమాటిక్ మాత్రం చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు జీతూ జోసెఫ్‌ దృశ్యం కు మంచి చక్కని కొనసాగింపు ను ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. దానికి వెంకటేష్ పూర్తి న్యాయం చేశాడు.

చివరగా : దృశ్యం 2 తో కూడా మెప్పించిన వెంకటేష్‌.

రేటింగ్‌ : 2.75/5.0