Drushyam 2: రిలీజ్ స‌మ‌యంలో చిక్కుల్లో ప‌డ్డ దృశ్యం 2.. చెప్పిన టైంకి వ‌స్తుందా?

Drushyam 2: సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్‏గా వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా దృశ్యం 2. మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానుంది.

TheNewsQube-
drushyam2 team is in trouble2
drushyam2 team is in trouble2

ప్రపంచ వ్యాప్తంగా 240 దేశాల్లో ఉన్న ప్రైమ్ మెంబర్స్ ఈ సినిమాను చూడపోతున్నారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.రీసెంట్‌గా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది.

పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తుండగా.. మళ్లీ వరుణ్ హత్యకు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకువస్తారు పోలీసులు. ఇక దృశ్యం 2 ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ సస్పెన్స్‏తో సాగిపోయింది.

ఊహించని విధంగా సినిమాకి లీగల్ సమస్యలు ఎదురుఅవుతున్నట్లు మీడియా వర్గాల సమాచారం. హాట్ స్టార్ సంస్థ ముందుగా తమతో డీల్ చేసుకుని.. దాన్ని క్యాన్సిల్ చేయకుండానే మధ్యలో అమేజాన్ ప్రైమ్‌కు వెళ్లిపోవడం పట్ల ఆ సంస్థ ఆగ్రహంతో ఉందని, దీనిపై లీగల్ నోటీసులు ఇచ్చిందని సమచారం.

drushyam2 team is in trouble
drushyam2 team is in trouble

‘దృశ్యం-2’కు సంబంధించి సురేష్ బాబుతో పాటు ఇంకో ఇద్దరు నిర్మాతలు ఉండగా.. వారిలో ఒకరు డిస్నీ+హాట్ స్టార్ వాళ్లతో డీల్ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఆ డీల్ సంగతి ఎటూ తేలకముందే తన ప్రొడక్షన్లో వచ్చిన మరో చిత్రం ‘నారప్ప’ సినిమాను రిలీజ్ చేసిన ప్రైమ్ వాళ్లతో సురేష్ బాబు ‘దృశ్యం-2’ విడుదలకు డీల్ కుదుర్చుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో హాట్ స్టార్ సంస్ద లీగల్ ఫైట్‌కు రెడీ అయినట్లు వినికిడి. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.