Drushyam : రెండో ‘‘దృశ్యం’’ వచ్చేసింది..

Drushyam : ‘దృశ్యం’ సినిమా ఎంత బాగుంటుందో చూసిన ప్రతిఒక్కరికీ తెలుసు. ఫ్యామిలీ సెంటిమెంటు, సస్పెన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన ఈ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ అయింది. మొదట 2013లో మలయాళంలో రూపొందించిన ఈ మూవీని తర్వాత 2014లో తెలుగులో, అనంతరం తమిళ, హిందీ తదితర భాషల్లో రీమేక్ చేశారు. అన్ని భాషల్లోనూ విజయవంతమైన చిత్రంగా నిలిచింది. చివరి నిమిషం వరకూ ఏం జరుగుతుందో తెలియనంత ఉత్కంఠ ఈ సినిమాకు తిరుగులేని బలమని చెప్పొచ్చు.

Drushyam : second-drushyam-coming
Drushyam : second-drushyam-coming

మరోసారి..

ఈ ‘దృశ్యం’ పిక్చర్ కి ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. అఫిషియల్ ట్రైలర్ ని ‘అమెజాన్ ప్రైమ్’ ఇవాళ(శనివారం) రిలీజ్ చేసింది. సినిమాను ఈ నెల 19న ‘అమెజాన్ ప్రైమ్’లో మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ‘దృశ్యం’ మూవీకి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫే ‘దృశ్యం2’కి కూడా డైరెక్షన్ చేశారు. మొదటి ‘దృశ్యం’లో నటించిన మోహన్ లాల్, మీనా, అన్సిబ, ఎస్తర్ తదితరులే రెండో ‘దృశ్యం’లోనూ నటించారు. ‘దృశ్యం2’కి పున:ప్రారంభం అనే క్యాప్షన్ పెట్టారు. అంటే హిస్టరీ రిపీట్ అవుతుందని, మరోసారి అన్ని భాషల్లోకి రీమేకై సక్సెస్ సాధిస్తుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

Advertisement