Narappa : నారప్ప, ఎఫ్ 3 కంటే ముందే దృశ్యం 2..!

Narappa : నారప్ప, ఎఫ్ 3 సినిమాలతో పాటు దృశ్యం 2 సినిమాలు చేస్తున్నాడు వెంకటేష్. తమిళ సూపర్ హిట్ అసురన్ తెలుగు రీమేక్‌గా నారప్ప తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ మేరకు అధికారకంగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం, మెగాస్టార్ చిరంజీవి – రాం చరణ్‌ల ఆచార్య సినిమాలు పోస్ట్ పోన్ చేశారు. ఈ క్రమంలోనే నారప్ప కూడా పోస్ట్ పోన్ చేశారు.

drushyam-2-is-first-than-narappa-f3
drushyam-2-is-first-than-narappa-f3

ఇక ఆగస్టు 27న విడుదల చేయాల్సిన ఎఫ్ 3 కూడా ఫిక్స్ చేసిన డేట్‌కి రిలీజ్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకి కరోనా బ్రేక్ వేసింది. దర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ఆపేశారు. దాంతో ఎఫ్ 3 అనుకున్న ఆగస్టు 27న రిలీజ్ కావడం కష్టమని అంటున్నారు. అయితే మలయాళ సూపర్ హిట్ సీక్వెల్ సినిమా దృశ్యం 2 మాత్రం ఈ రెండు సినిమాల కంటే ముందే రిలీజ్ చేస్తారని టాక్ మొదలైంది.

Narappa : నారప్ప, ఎఫ్ 3 కంటే ముందు దృశ్యం 2…

వెంకటేష్ – మీనా జంటగా నటించిన ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ – మీనా జంటగా నటించిన దృశ్యం 2 కి రీమేక్ గా అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. 50 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనుకున్న చిత్ర యూనిట్ 47 రోజుల్లోనే పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను థియేటర్స్ ఓపెన్ కాగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. నారప్ప, ఎఫ్ 3 కంటే ముందు దృశ్యం 2 రాబోతుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.

Advertisement