Drishyam-2 : ‘దృశ్యం-2’ రీమేక్ హిందీ హక్కులు దక్కించుకుంది వాళ్ళే..!

Drishyam-2 : ‘దృశ్యం-2’ రీమేక్ హిందీ హక్కులు ఎవరు దక్కించుకుంటారో అని ఇన్నాళ్ళు బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు సాగాయి. ఎట్టకేలకి ఈ సినిమా రీమేక్ హిందీ హక్కులను పనోరమా ఇంటర్నేషనల్ స్టూడియోస్ ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ‘దృశ్యం-2’ సినిమాలో మోహన్ లాల్ – మీనా జంటగా నటించారు. తెలుగులో విక్టరీ వెంకటేశ్ – మీనా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది.

drishyam-2-hindi-remake-rights-are-achieved
drishyam-2-hindi-remake-rights-are-achieved

మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ‘దృశ్యం’ సినిమాకి ఇటు తెలుగుతో పాటు అటు హిందీలో కూడా రీమేక్ చేశారు. హిందీలో అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ నటించారు. మూడు భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక రీసెంట్‌గా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ‘దృశ్యం-2’. దాంతో సీక్వెల్ కూడా తెలుగు తో పాటు హిందీలో రూపొందిస్తున్నారు. సీక్వెల్ కాబట్టి అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే మొదటి దృశ్యం సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

Drishyam-2 : హిందీ వెర్షన్‌కి దర్శకుడెవరన్నది త్వరలో తెలియనుంది.

అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను మంచి కథా, కథనాలతో మెప్పించారు దర్శక, నిర్మాతలు. ఇక హింది సీక్వెల్లో కూడా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ – శ్రీయశరన్ నటిస్తారా లేక మరెవరైనా నటిస్తారా అన్నది ఇంకా నిర్మాత వెల్లడించాల్సి ఉంది. అలాగే దర్శకుడు ఎవరన్నది కూడా వెల్లడి కావాల్సి ఉంది. మలయాళంలో తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్‌కి దర్శకత్వం వహించాడు. మరి హిందీ వెర్షన్‌కి దర్శకుడెవరన్నది త్వరలో తెలియనుంది.

Advertisement