VIRAL VIDEO: కెన‌డాలోను మారుమ్రోగిపోతున్న సౌత్ మూవీ సాంగ్.. వైర‌ల్‌గా మారిన వీడియో

ఇటీవ‌లి కాలంలో సౌత్ సినిమాల క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌న సినిమాలు బాలీవుడ్‌లోనే కాదు విదేశాల‌లో సైతం ర‌చ్చ చేస్తున్నాయి. బాహుబ‌లి, కేజీఎఫ్ వంటి చిత్రాలు ప‌ర‌భాషా చిత్రాల రికార్డ్‌ని సైతం బ్రేక్ చేయ‌గా, అల వైకుంఠ‌పుర‌ములోని సాంగ్స్ అంద‌రిని ఎంత‌గానో అల‌రించాయి. బుట్ట‌బొమ్మ సాంగ్ అయితే సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేసింది. ఈ సాంగ్స్‌ని డేవిడ్ వార్న‌ర్ లాంటి క్రికెట‌ర్ కూడా ఇష్ట‌ప‌డ్డాడు. ఇప్పుడు విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రంలోని వాతి క‌మింగ్ అనే పాట కూడా చాలా ఫేమ‌స్ అయింది . ఈ పాట‌ను చాలా మంది అనుక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

కెన‌డాలోను వాతి క‌మింగ్ అనే పాట ఓ రేంజ్‌లో మారుమ్రోగిపోతుంది. బేస్‌మెంట్ గ్యాండ్ అనే డ్యాన్స్ ట్రూప్ వాతి క‌మింగ్ అనే పాట‌కు ఇండియ‌న్ స్టెప్స్ మిక్స్ చేసి డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ నెటిజ‌న్స్‌ని సైతం ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 6 ల‌క్ష‌ల‌కు పైగా ఈ వీడియో వ్యూస్ సాధించ‌గా, రానున్న రోజుల‌లో మ‌రిన్ని వ్యూస్ రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇటీవ‌ల బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే కూడా వాతి క‌మింగ్ అనే పాట‌కు సంబంధించి త‌న‌దైన స్టైల్ లో వీడియో రూపొందించి షేర్ చేసింది. ఇది కూడా వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Basement Gang (@basementgang)

Advertisement