Niharika Konidela: నిహారిక ఏంది సిగ‌రెట్‌లు తాగుతుంది..!

Niharika Konidela: ఇప్పుడు ట్రెండ్ మారింది. మ‌గాళ్ల‌తో మ‌హిళ‌లు అన్ని రంగాల‌లో పోటీ పడుతున్నారు. చ‌దువులు,జాబ్స్ విష‌యంలో అనుకుంటే పొర‌పాటే. మ‌ద్యం, స్మోకింగ్‌తో పాటు ఇత‌ర దుర‌ల‌వాట్ల విషయంలోను మ‌హిళ‌లు చాలా స్పీడ్‌గా ఉన్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు అయితే మందు, స్మోకింగ్ చేసే ఫొటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వారి బాగోతాన్ని చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Niharika Konidela
Niharika Konidela

మెగా డాట‌ర్ నిహారిక పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌పోయిన ఆమెకు మాములు క్రేజ్ లేదు. చేసిన ప్ర‌తి సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టింది. ఆ మ‌ధ్య వెబ్ సిరీస్ లాంచ్ కాగా, ఆ కార్య‌క్ర‌మానికి నిహారిక‌తో పాటు ఆమె భ‌ర్త కూడా హాజ‌రు అయ్యారు. క‌రోనా వ‌ల‌న వెబ్ సిరీస్ షూటింగ్‌కి అంత‌రాయం ఏర్ప‌డుతుంది. అయితే సెకండ్ వేవ్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా త‌న భ‌ర్త‌తో క‌లిసి పాండిచ్చేరి వెళ్లింది.

పాండిచ్చేరిలో కొత్త జంట చేసిన సంద‌డికి సంబంధించి ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఫొటోల‌లో నిహారిక కొత్త లుక్‌లో క‌నిపించే స‌రికి అంతా షాక్ అయ్యారు. కొంద‌రు లావు అయింద‌ని అంటుంటే మ‌రి కొంద‌రు డీ గ్లామ‌రస్‌గా మారింద‌ని కామెంట్స్ చేశారు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిహారిక తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో ఓ సిగరెట్ ప్యాకెట్‌ను చూపించారు. స్వీట్ సిగరెట్ అంటూ బాగుందనే ఎమోజీలను షేర్ చేశారు. షూటింగ్ కోసం ఆ స్వీట్ సిగరెట్‌లను నిహారిక తాగినట్టు కనిపిస్తోంది. పెళ్లి త‌ర్వాత నిహారిక స్పీడు మాములుగా లేదంటూ నెటిజ‌న్స్ సెటైర్స్ వేస్తున్నారు.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో నిహారిక‌- చైత‌న్య‌ల వివాహం ఘ‌నంగా జ‌ర‌గ‌గా, ఈ పెళ్లి అంగ‌రంగ వైభవంగా జరిగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి, సాయిధ‌ర‌మ్ తేజ్, అల్లు అర్జున్, వైష్ణ‌వ్ తేజ్, వ‌రుణ్ తేజ్‌,నాగ‌బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పెళ్లి వేడుక‌లో తెగ సంద‌డి చేశారు.