Bigg Boss 5 Elimination: బిగ్ బాస్ లీక్ : ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవ‌రో తెలుసా?

Bigg Boss 5 Elimination: బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతగా.. మూడు ఎలిమినేషన్స్ పూర్తి చేసుకుంది.. ఇక ఇప్పుడు నాలుగవ వారం ఎలిమినేషన్ ఎవరనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గడిచిన మూడు ఎలిమినేషన్స్ ప్రక్రియలో ప్రేక్షకుల అంచనా ప్రకారమే.. సరయు, ఉమాదేవి, ల‌హ‌రి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్, అనీ మాస్ట‌ర్ పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఈ వారం ఎలిమినేట్ కానున్నాడ‌ని తెలుస్తుంది. అత‌ని ప్ర‌వ‌ర్త‌న ఎవ‌రికి స‌రిగా న‌చ్చ‌డం లేదు. ప్రతి ఒక్కరినీ ఒక్కో జంతువుతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్‌ తెప్పిస్తున్నాడు. తననేమైనా అంటే చెడుగుడు ఆడేసే ఈయన మిగతా కంటెస్టెంట్లను మాత్రం నోటికొచ్చినట్లు తిడుతుంటాడు. వారిని ఆయా జంతువులతో పోలుస్తూ టార్చర్‌ పెడుతుంటాడు.

మొదట్లో హౌస్‌లో గుంటనక్క ఉందని ప్రచారం చేశాడు నటరాజ్‌. ఆ గుంటనక్క ఎవరు? అని స్వయంగా హోస్ట్‌ నాగార్జున అడిగినప్పటికీ ఆయన పెదవి విప్పలేదు. పైపెచ్చు హౌస్‌లో ఊసరవెల్లి కూడా ఉందని, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రెండూ ఎవరో చెప్తానన్నాడు. అయితే రానురానూ ఆ రెండింటితో పాటు పిల్లి, నెమలి, ఎలుగుబంటి.. ఇలా ఎన్నో రకాల జంతువులు ఆయన లిస్టులో చేరాయి.

రవిని గుంటనక్క అన్న అతడు.. ఇప్పుడు అదే రవిని నత్తతో పోల్చాడు. సోషల్‌ మీడియాలో నెటిజన్లు కూడా నటరాజ్‌ మాస్టర్‌ పద్ధతి బాగోలేదని విమర్శిస్తున్నారు. ఒకటీరెండుసార్లు ఏదైనా అంటే లైట్‌ తీసుకుంటారేమోకానీ పదేపదే జంతువులతో పోల్చడం ఏంటి? అని తిట్టిపోస్తున్నారు. ఈయన హౌస్‌మేట్స్‌కు పూటకో జంతువు పేరు పెడతాడంటూ నటరాజ్‌ను జంతుశాస్త్ర పితామహుడు అని సెటైర్లు వేస్తున్నారు.

న‌ట‌రాజ్ మాస్ట‌ర్, అనీ మాస్ట‌ర్ ఇద్ద‌రికి ఓట్లు త‌క్కువే వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ వారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఇంటి నుండి వెళ్ల‌డం ఖాయం అని చెబుతున్నారు. చూడాలి ఈ సారి అంచ‌నాలు త‌ప్పుతాయా, ఊహించిందే జ‌రుగుతుందా?