Varalakshmi: వ‌ర‌ల‌క్ష్మీ గ‌ట్టిగా హ‌గ్ చేసుకున్న ఈ వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

Varalakshmi: వరలక్ష్మీ శరత్ కుమార్… ప్రస్తుతం కోలివుడ్‏తోపాటు టాలీవుడ్‏లో ఫీమేల్ విలన్‏గా దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మగా నటించి మరోసారి తానేంటో నిరుపించుకుంది వరలక్ష్మీ. నాంది చిత్రంలో ముఖ్య పాత్ర‌లో క‌నిపించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు ఈ అమ్మ‌డ‌కి తెలుగులో ఆఫర్స్ కోకొల్ల‌లుగా వ‌స్తున్నాయి.

Do you Know Details Bout Varalakshmi Sarat Kumar Makeup Man
Do you Know Details Bout Varalakshmi Sarat Kumar Makeup Man

ఇప్పుడున్న నటుల్లో లేడీ విలన్ అంటే ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, తెలుగు తెరపై మరోసారి విలన్ గా విజృంభించనుంది . ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ను విల‌న్ పాత్ర కోసం ఎంపిక చేశాడ‌ట ద‌ర్శ‌కుడు.

Do you Know Details Bout Varalakshmi Sarat Kumar Makeup Man
Do you Know Details Bout Varalakshmi Sarat Kumar Makeup Man

విజయ్ ‘సర్కార్’, విశాల్ ‘పందెంకోడి 2’ సినిమాలతో కోలీవుడ్‌లో వరూ పేరు మార్మోగిపోయింది. తెలుగులో క్రాక్, నాంది సినిమాల‌తో హోరెత్తింది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా త‌న మేక‌ప్ ఆర్టిస్ట్‌తో క‌లిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ కాస్త ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టింది.

Do you Know Details Bout Varalakshmi Sarat Kumar Makeup Man
Do you Know Details Bout Varalakshmi Sarat Kumar Makeup Man

ర‌మేష్ అనే మేక‌ప్ మెన్ కొన్ని సంవ‌త్స‌రాలుగా ఎంతో నిజాయితీగా ప‌ని చేస్తున్నాడు.ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా అత‌నిని హ‌గ్ చేసుకున్న ఫొటోని షేర్ చేస్తూ.. ‘నాకు సంబంధించిన అన్ని విషయాల్లో నువ్వే రమేష్ అన్నా.. నువ్వు లేకపోతే నేనేం చెయ్యలేను.. చెయ్యగలిగే దాన్ని కాదు.

నువ్వు కేవలం నా మేకప్ ఆర్టిస్ట్‌వి మాత్రమే కాదు.. నా కుడి భుజం.. ఈ నా ప్రయాణం ఇంతవరకు వచ్చిందంటే దానికి కారణం నువ్వే.. నేనిచ్చిన బర్త్‌డే గిఫ్ట్ నచ్చిందనే అనుకుంటున్నాను’ అంటూ భావోద్వేగభరితంగా రాసుకొచ్చారు వరలక్ష్మీ శరత్ కుమార్.