Sumanth : సుమంత్ హిట్ అందుకుంటాడని నమ్మకం ఏంటో..?

Sumanth : సుమంత్.. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి కెరీర్ లో నెమ్మదిగా సాగుతు సినిమాలు చేస్తున్నాడు. ప్రేమకథ, సత్యం, గౌరీ.. లాంటి సూపర్ హిట్స్ సుమంత్ ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్య చేసిన సినిమాలతో యావరేజ్ హిట్ అందుకుంటున్నాడు తప్ప బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే సుమంత్‌ తో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు మాత్రం రెడీగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

Do you believe that Sumant will get a hit ..?
Do you believe that Sumant will get a hit ..?

అనగనగా ఒక రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న సుమంత్ ఈ సినిమాతో భారీ హిట్ అందుకోవాలని బాగా తాపత్రయపడుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వాల్తేరు శీను పాత్రలో సుమంత్ కనిపించబోతున్నాడు. లుంగీ మరియు గుండుతో విభిన్నమైన లుక్ లో సుమంత్ కనిపించిన ఈ లుక్ ఆకట్టుకుంది. అభిమానులతో పాటు ప్రేక్షకులు ఈ సినిమాతో సుమంత్ కి హిట్ దక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. సినిమా షూటింగ్ ను కరోనా సెకండ్ వేవ్ లోను బ్రేక్ లేకుండా చిత్రీకరణ జరిపారు.

Sumanth : సుమంత్ కమర్షియల్ హీరోగా సెటిల్ అవ్వలేక పోవడం మైనస్..!

తాజాగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్లుగా అధికారికంగా ప్రకటించడంతో విడుదలకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం. సుమంత్ కెరీర్ ప్రారంభించి రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికి ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా సెటిల్ అవ్వలేక పోవడం కొంత మైనస్ అని చెప్పాలి. త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లుగా సుమంత్ వెల్లడించాడు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి థియేటర్లు మళ్ళీ ప్రారంభం అయిన తర్వాత సినిమా విడుదల చేయనున్నారు.

Advertisement