Prabhas-Pooja: ప్రభాస్- పూజా హెగ్డే మధ్య గొడవలా.. చిత్ర యూనిట్ ఏం చెప్పింది ?

Prabhas-Pooja: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న ప్రభాన్ పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటున్నాడు. అయితే ప్రభాస్ పూజాల మధ్య గొడవలు నెలకొన్నాయి అని కొద్ది రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ – పూజా హెగ్డే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదంటూ పుకార్ షికార్ చేస్తోంది.

Do Prabhas and Pooja Hegde Have Conflicts between them?
Do Prabhas and Pooja Hegde Have Conflicts between them?

రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ లో ఈ జంట నటించారు. వచ్చే ఏడాది మకర సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవలు వస్తున్న నేపథ్యంలో రాధే శ్యామ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇవి నిరాధార వార్తలు అంటూ క్లారిటీనిచ్చింది.

ప్రభాస్- పూజా హెగ్డే ఒకరిపై ఒకరు గొప్ప గౌరవం కలిగి ఉన్నారు. ఒకరంటే ఒకరు ప్రశంసలు కురిపిస్తారు. ఆఫ్ ద స్క్రీన్ లో గొప్ప స్నేహభావాన్ని పంచుకుంటారు. దానివల్ల తెరపైనా మాయ చేసేంతగా గొప్ప రొమాన్స్ .. కెమిస్ట్రీ పండాయి.. అని యువి సంస్థ క్లారిటీనిచ్చింది. “పూజ ఎప్పుడూ చిత్రీకరణల విషయంలో ఇబ్బంది పెట్టలేదు. చాలా సమయపాలనతో ఉండేది.

నిజానికి ఆమెతో పని చేయడం చాలా సులభం. ఈ రూమర్స్ కేవలం కొందరి ఊహకు తగ్గట్టుగా ఉన్నాయి. నాయకానాయికలు.. మొత్తం టీమ్ మధ్య ప్రతిదీ బాగానే ఉన్నాయి. ప్రేక్షకులు మర్చిపోలేని థియేట్రికల్ అనుభవాన్ని అందించడానికి చాలా సంతోషిస్తున్నాను“ అని సుదీర్ఘ వివరణ ఇచ్చింది.

1970 కాలంలో యూరప్ లో జరిగిన ప్రేమకథగా రాధే శ్యామ్ చిత్రం తెరకెక్కింది. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నరాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్‌ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు.

రాధే శ్యామ్ చిత్రాన్ని 14 జనవరి 2022 న దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకంగా కొన్ని అద్భుతమైన సెట్లు వేసి తెరకెక్కించారు. అన్నింటిని మించి ప్రభాస్ – పూజా నడుమ రొమాంటిక్ లవ్ స్టోరీ హైలైట్ కాబోతుందని ఇప్పటికే కథనాలు వేడెక్కిస్తున్నాయి.

ఇక రాధేశ్యామ్ కి డీడీఎల్ జే లవ్ ఫీల్ ని రాధాకృష్ణ యాడ్ చేశారని గుసగుసలు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి రొమాంటిక్ సన్నివేశాల్లో ఎంత మాత్రం ఫీల్ మిస్ కాకుండా రక్తికట్టేలా వాస్తవాన్ని ప్రతిబింబించేలా రియలిస్టిక్ గానే ఆయా సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం