Anasuya: అన‌సూయ‌ని వ‌ద‌ల‌ని మెగా హీరోస్.. గోల్డెన్ లెగ్ అని ఫీల‌వుతున్నారా ?

Anasuya:యాంక‌ర్‌గా ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన అన‌సూయ‌.. ఇప్పుడు న‌టిగా ఫుల్ బిజీ అయింది. త‌న పాత్ర‌కు గుర్తింపు తెచ్చే సినిమాల‌లో నటిస్తూ క్రేజ్ పెంచుకుంటుంది అన‌సూయ‌. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `పుష్ప`లోనూ అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ కాన్పెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ రోల్ మాస్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వనుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


Do Mega Heroes Feel Anasuya As a Golden Leg
Do Mega Heroes Feel Anasuya As a Golden Leg

గ్లామ‌ర్ డాల్‌గా ఉన్న అన‌సూయ‌కు రంగ‌స్థ‌లం చిత్రం ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అన‌సూయ‌లో ఎంత మంచి న‌టి ఉంద‌నేది రంగ‌మ్మ‌త్త పాత్ర నిరూపించింది. రామ్ చ‌ర‌ణ్ సినిమా త‌ర్వాత అన‌సూయ .. వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమాలో కూడా చిన్న పాత్రలో మెరిసింది . విన్న‌ర్ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి స్టెప్పులేసింది. అప్ప‌ట్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించే అవ‌కాశం కూడా అన‌సూయ‌కు వ‌చ్చింది. కానీ ఆ స‌మ‌యంలో గ‌ర్భ‌వ‌తిగా ఉండ‌టంతో వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దుల‌కుంది.


Do Mega Heroes Feel Anasuya As a Golden Leg
Do Mega Heroes Feel Anasuya As a Golden Leg

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాల్లోనూ అన‌సూయ న‌టిస్తోంది. ఇప్పుడు మ‌రోసారి చిరంజీవితో క‌లిసి న‌టించే అవ‌కాశం ఈ అమ్మ‌డు ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తుంది. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`లో అనసూయ కీలక పాత్ర పోషించనుంది. చిరుతో చెప్పుకోదగ్గ రేంజులో సన్నివేశాల్లో కనిపించనుందని తెలిసింది. ఇందులో అన‌సూయ పాత్ర ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇస్తుంద‌ని అంటున్నారు.

మెగా హీరోల సినిమాల‌లో అన‌సూయ‌కు ప్ర‌త్యేక పాత్ర ఇవ్వ‌డం ప‌ట్ల అభిమానులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అమ్మ‌డిని మెగా ఫ్యామిలీ గోల్డెన్ లెగ్‌గా భావిస్తున్నారా ఏంటి అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. క్షణం.. రంగస్థలం.. యాత్ర లాంటి చిత్రాలలో నటిగా గుర్తుండిపోయే పాత్రలను పోషించిన అనసూయ కెరీర్ పరంగా ఇప్పుడు బెస్ట్ ఫేజ్ లో ఉన్నారు. వైవిధ్యం విలక్షణత ఉన్న పాత్రలతో ఈ బ్యూటీ పరిశ్రమను ఆకర్షించింది. ఇప్పటికిప్పుడు అరడజను పైగా చిత్రాల్లో నటిస్తోంది.