Sarkaru vari pata : ‘సర్కారు వారి పాట’ సెకండ్ షెడ్యూల్ ఏమైందో తెలుసా..?
Vedha - March 29, 2021 / 10:38 AM IST

Sarkaru vari pata : సర్కారు వారి పాట .. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలలో మోస్ట్ ఎవైటెడ్ మూవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్ లో 27గా రాబోతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రంగ్ దే సినిమా రిలీజై కీర్తి సురేష్ అకౌంట్ లో హిట్ చేరింది. దాంతో సర్కారు వారి పాట సినిమాకి కీర్తి బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది.

do-any-one-know-what-happened-to-the-second-schedule-of-sarkaru-vari-pata
నెలరోజుల పాటు జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ తో పాటు మహేష్ బాబు కీర్తి సురేష్ ల మీద కీలకమైన సన్నివేశాలను.. ఒక సాంగ్ ని కంప్లీట్ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత గోవాలో కూడా ఒక సాంగ్ పూర్తి చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఈ నెల నుంచి దుబాయ్ లోనే సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు ఈ షెడ్యూల్ కూడా నెలరోజుల పాటు షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు మళ్ళీ సర్కారు వారి పాట సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
Sarkaru vari pata : కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిందా..?
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలన్ని షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. కానీ సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్ లో ప్లాన్ చేసిన సర్కారు వారి పాట మాత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయినట్టు ఫిల్మ్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది మేకర్స్ నుంచి క్లారిటీ వస్తేగాని అసలు విషయం ఏంటో అర్థమవుతుంది. కాగా ఈ సినిమా 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. జీఎంబీ ఎంటర్‌టైనమెంట్స్..14 రీల్స్ ప్లస్..మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.