DJ Tillu: దూసుకుపోతున్న డీజే టిల్లు.. ఆరు రోజుల క‌లెక్ష‌న్స్ వివ‌రాలు ఏంటి?

NQ Staff - February 18, 2022 / 06:43 PM IST

DJ Tillu: దూసుకుపోతున్న డీజే టిల్లు.. ఆరు రోజుల క‌లెక్ష‌న్స్ వివ‌రాలు ఏంటి?

DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం డీజే టిల్లు . సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం గత శనివారం రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో తొలి షోకే జనాల తాకిడి కనిపించింది. తొలి షో తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటివరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్‌లో దూసుకుపోతున్నాడు డీజే టిల్లు.

DJ Tillu Six Days Collections

DJ Tillu Six Days Collections

అన్ని ఏరియాల్లో అంచనాలను మించి కలెక్షన్స్ వస్తుండటం హీరోహీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి మంచి బూస్టింగ్ ఇస్తోంది. ఈ సినిమాకు కొన్న ప్రతీ ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఇఫ్పుడు లాభాల్లోకి వచ్చేసాడు. నాలుగో రోజు నుంచి లాభాల పంట పండుతుంది. ఆరో రోజు కూడా ప్రపంచ వ్యాపంగా కోటికి పైగా షేర్ వసూలు చేసింది డిజే టిల్లు. సినిమాలో కామెడీగా బాగా పేలడంతో థియేటర్స్ దగ్గర ఆడియన్స్ బాగానే కనిపిస్తున్నారు.

వారం రోజుల తర్వాత కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ మోత మోగుతూనే ఉంది. ఇప్పటికీ చెప్పుకోదగ్గర వసూళ్లు తీసుకొస్తున్నాడు డిజే టిల్లు. ముఖ్యంగా మాస్ సెంటర్స్‌లో డిజే టిల్లు రీ సౌండ్ అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ రప్ఫాడిస్తున్నాడు డిజే టిల్లు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే హీరో సిద్దు జొన్నలగడ్డే అందించాడు .

తన స్నేహితుడు విమల్ కృష్ణ తో కలిసి కథ, స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దర్శకుడిగా మాత్రం విమల్ ఉన్నాడు. నరుడి బతుకు నటన నుంచి ఈ సినిమా టైటిల్‌ను డిజే టిల్లుగా మార్చేసారు. నవ్వుకోడానికి టిల్లు ఫుల్ టైమ్ పాస్ అని టాక్ రావడంతో వసూళ్ల పంట పండుతుంది. ఏపీ, తెలంగాణ 6 డేస్ కలెక్షన్స్: 10.05 కోట్లు రాబ‌ట్టింది. రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 0.75 కోట్లు రాబట్టింది.

ఈ చిత్రాన్ని ఏకంగా 8.50 కోట్లకు పైగా బిజినెస్ చేసారు. అయితే ముందు కష్టమే అనుకున్నా.. ఇప్పుడు వస్తున్న ఓపెనింగ్స్ చూసిన తర్వాత ఈజీ అయిపోయింది. 4 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది

Read Today's Latest బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us