Dj Tillu: డీజే టిల్లు హ‌వా త‌గ్గ‌ట్లేదుగా… మూడో రోజు మంచి లాభాలు

NQ Staff - February 16, 2022 / 12:14 PM IST

Dj Tillu: డీజే టిల్లు హ‌వా త‌గ్గ‌ట్లేదుగా… మూడో రోజు మంచి లాభాలు

Dj Tillu: ఎలాంటి అంచ‌నాలు లేకుండా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించిన చిత్రం డీజే టిల్లు. చాలా చోట్ల సినిమాకు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నైజాంలో అయితే లాభాల పంట పండుతుంది ఈ సినిమాకు. మూడు రోజుల్లోనే సినిమా 9 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మూడో రోజు జోరు కాస్త తగ్గినా కూడా నిలబడింది. ముఖ్యంగా మాస్ సెంటర్స్‌లో డిజే టిల్లు రీ సౌండ్ అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ రప్ఫాడిస్తున్నాడు డిజే టిల్లు.

Dj Tillu 3rd Day Box Office Collections

Dj Tillu 3rd Day Box Office Collections

ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే హీరో సిద్దు జొన్నలగడ్డే అందించాడు. తన స్నేహితుడు విమల్ కృష్ణతో కలిసి కథ, స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దర్శకుడిగా మాత్రం విమల్ ఉన్నాడు. నరుడి బతుకు నటన నుంచి ఈ సినిమా టైటిల్‌ను డిజే టిల్లుగా మార్చేసారు. నవ్వుకోడానికి టిల్లు ఫుల్ టైమ్ పాస్ అని టాక్ రావడంతో వసూళ్ల పంట పండుతుంది.

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమే ‘డీజే టిల్లు’. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. దీనికి శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, కిరీటి తదితరులు కీలక పాత్రలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సిద్దు జొన్నలగడ్డకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ ‘డీజే టిల్లు’ మూవీపై అంచనాలు ఉండడంతో రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి దీనికి అదిరిపోయే స్పందన కూడా దక్కింది.
?
‘డీజే టిల్లు’కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3వ రోజూ భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 73 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి రూ. 1.40 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

‘డీజే టిల్లు’ మూవీకి మూడు రోజులకు కలిపి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 99 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి రూ. 7.20 కోట్లు షేర్, రూ. 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో ఇది రూ. 9.26 కోట్లు రాబట్టింది. అంటే మరో రూ. 24 లక్షలు వస్తే క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Read Today's Latest బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us