ALLU ARJUN: రేర్ ఫీట్.. బ‌న్నీ సినిమాకు అరుదైన రికార్డ్‌, ఫ్యాన్స్ లో ఆనందం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ఆయ‌న న‌టించిన సినిమాలు, అందులోని సాంగ్స్ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అల వైకుంఠ‌పురుమ‌లో చిత్రంతో పాటు అందులోని సాంగ్స్ ఎన్ని రికార్డులు న‌మోదు చేశాయో ప్ర‌త్యేకించి చెప్ప‌నక్క‌ర్లేదు. ఇక ఇప్పుడు మూడేళ్ల క్రితం బ‌న్నీ న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రం ఖాతాలో స‌రికొత్త రికార్డ్ న‌మోదైంది. డీజే చిత్రం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ సినిమాలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

హిందీలో వందల కొద్దీ మిలియన్ వ్యూస్ అందుకున్న డీజే చిత్రం ఇపుడు డైరెక్ట్ తెలుగులో యూట్యూబ్ ఛానెల్లో 100 మిలియన్ వ్యూస్ అందుకున్నట్టుగా దిల్ రాజు నిర్మాణ సంస్థ వెల్లడించారు. గ‌తంలో మ‌హేష్ బాబు హీరోగాన‌టించిన శ్రీమంతుడు చిత్రం ఈ రికార్డ్ సెట్ చేయ‌గా, ఇప్పుడు డీజే చిత్రం ఆ ఫీట్‌ను అందుకుంది. దీంతో ఫ్యాన్స్ అంద‌రు ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్.. పుష్ప అనే సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 13న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మూవీ వాయిదా ప‌డుతుంద‌ని టాక్.

Advertisement