Tollywood: టాలీవుడ్‌ని వ‌ణికిస్తున్న విడాకుల వ్య‌వ‌హారం.. యంగ్ డైరెక్ట‌ర్ డైవ‌ర్స్ తీసుకోబోతున్నాడంటూ ప్ర‌చారం

Tech Sai Chandu - October 17, 2021 / 03:09 PM IST

Tollywood: టాలీవుడ్‌ని వ‌ణికిస్తున్న విడాకుల వ్య‌వ‌హారం.. యంగ్ డైరెక్ట‌ర్ డైవ‌ర్స్ తీసుకోబోతున్నాడంటూ ప్ర‌చారం

Tollywood: టాలీవుడ్‌ని విడాకుల వ్య‌వ‌హారం వ‌ణికిస్తుంది. చై- సామ్ విడాకుల త‌ర్వాత ఓ యంగ్ హీరో విడాకులు తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు కుర్ర ద‌ర్శ‌కుడు విడాకులు తీసుకోనున్న‌ట్టు ప్రచారం న‌డుస్తుంది. నిన్న‌టి వ‌ర‌కు అన్యోన్యంగా ఉన్న దంప‌తులు కావ‌చ్చు.. లేదా ప్రేమికులు కావొచ్చు రేపు అంద‌రికి షాక్ ఇస్తూ విడిపోతూ ఉంటారు. ఇక్క‌డే మ‌న‌స్ప‌ర్థ‌లు వ చ్చి విడిపోతూ ఉంటారు.

Tollywood

నాగ చైత‌న్య‌- స‌మంత జంట విడిపోయి ప‌ది రోజులు అయ్యిందో లేదో ఇప్పుడు టాలీవుడ్ లో మ‌రో విడాకుల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సారి విడాకులు తీసు కోబో యేది ఓ స్టార్ డైరెక్ట‌ర్ అని టాక్ ? ఇక ఆ డైరెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే ఇండ‌స్ట్రీలో ఆయన ఓ ప్రామిసింగ్ డైరక్టర్. మాంచి హిట్ సినిమా తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇండస్ట్రీలో పనిచేసే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఇప్పుడు ఇద్దరు కూడా పంతానికి పోయి విడి పోయేందుకు సిద్దం అయ్యారు అంటూ వారికి సన్నిహితులు అయిన వారు చెబుతున్నారు. వారిద్దరిని కలిపేందుకు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేసినా కూడా ప్రయోజనం లేదట. ఇద్దరు విడిపోవడమే తరువాయి అన్నట్లుగా ఉంది. ఇండస్ట్రీలో ఇలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతున్న నేపథ్యంలో పలువురు బాలీవుడ్ తరహాలోనే ఇలా అవ్వడం విచారకరం అంటున్నారు.

ఆ దర్శకుడు టాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలో మంచి సినిమాలు చేసి సక్సెస్ లు దక్కించుకుని ఒక్కసారిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత అతడు ఎక్కువగా సినిమాలు చేయలేక పోయాడు. మళ్లీ అతడు పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలో విడాకులు అతడి కెరీర్ పై ప్రభావం పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us