DIVI: హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా బిగ్ బాస్ బ్యూటీ

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాకు జ‌నాల‌లో మంచి గుర్తింపు ఉంది. ఈ గౌరవం ద‌క్క‌డాన్ని చాలా గర్వంగా భావిస్తుంటారు మహిళా సెలబ్రిటీలు. ఎందుకంటే ఈ జాబితాలో చోటును ప్రజలే వాళ్లకు కల్పిస్తారు కాబట్టి. తమను బాగా మెప్పించిన, ఆకట్టుకున్న సెలబ్రిటీలకు ఓటు వేసి ఈ జాబితాలో కూర్చోబెడతారు నెటిజన్లు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోల్ ఆధారంగా తయారుచేసిన ‘హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020’ జాబితాను తాజాగా విడుదల చేశారు. ఇది 40 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళా సెలబ్రిటీల జాబితా కాగా, టీవీ రంగానికి సంబంధించి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా దివి నిలిచింది.

మ‌హ‌ర్షి చిత్రంలో న‌టించిన దివి బిగ్ బాస్ కార్య‌క్ర‌మంతో చాలా ఫేమ‌స్ అయింది. ఈ అమ్మ‌డి అంద‌చందాల‌కు చాలా మంది ఫిదా అయ్యారు. ఆమెకు వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ కూడా ఇస్తున్నారు. రీసెంట్‌గా దివి న‌టించిన క్యాబ్ స్టోరీస్ ఓటీటీలో విడుద‌లైంది. ఇది ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది . అయితే ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో చిరంజీవి హీరోగా తెర‌కెక్క‌నున్న లూసిఫ‌ర్ చిత్రంలో న‌టించ‌నుంది. ఈ సినిమా త‌ర్వాత దివి రాత మార‌డం ఖాయంగా కనిపిస్తుంది.