DIVI: చిరంజీవి సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ.. దివి చెప్పిన స‌మాధానం ఏంటి ?

అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఈ షో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఐదో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. అయితే నాలుగో సీజ‌న్‌లో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్స్ మంచి ఆఫ‌ర్స్ ద‌క్కించుకున్నారు. త‌న అంద‌చందాల‌తో ఆక‌ర్షించిన దివి కూడా ఇప్పుడు ఫుల్ బిజీగా మారింది. ఈ అమ్మడు మే 28న స్పార్క్ ఓటీటీ లో స్ట్రీమ్ కానున్న క్యాబ్ స్టోరీస్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్న‌ది.

మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి చిత్రంలో దివి న‌టించ‌గా, ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ పాత్ర‌లో క‌నిపించింది. అయితే ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలోనే దివికి క్యాబ్ స్టోరీ ఆఫ‌ర్ వచ్చింద‌ట‌. ద‌ర్శ‌కుడు రాజేష్ చెప్పిన క‌థ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో మూవీని ఓకే చేసాన‌ని అంటుంది దివి. అయితే చిరంజీవి చేయ‌నున్న లూసిఫ‌ర్ రీమేక్‌లో దివి ఓ ముఖ్య పాత్ర చేయ‌నుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తుండ‌గా, ఇందులో నాకు ఓ కీల‌క రోల్ ద‌క్కింద‌. మెహ‌ర్ ర‌మేష్ నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అంటుంది దివి. త్వ‌ర‌లో లంబ‌సింగి అనే చిత్రంతో పాటు ఘ‌ర్ష‌ణ అనే వెబ్ సిరీస్‌లో న‌టించ‌నుంది దివి.