NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్‌కి ఎందుకు పొస‌గ‌డం లేదా.. అస‌లు నిజం ఏంటి?

NTR: సోష‌ల్ మీడియా ప్రాముఖ్యత ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిత్యం కొన్ని వేల కొల‌ది వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధ‌మో తెలియ‌క అభిమానులు క‌న్ఫ్యూజ్ అవుతుంటారు. కొన్ని సార్లు పుకార్ల‌పై సెల‌బ్రిటీలు స్పందించ‌డంతో క్లారిటీ వ‌స్తుంది. ఇంకొన్ని సార్లు ఎవ‌రు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియ‌క అయోమ‌యానికి గుర‌వుతుంటారు.

తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌కి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయ‌నే ప్ర‌చారం జోరుగా న‌డుస్తుంది. అందుకు కార‌ణం వీరిద్దరి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానుందని, ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ చేయ‌బోవు సినిమా ఇదేనంటూ ప్ర‌చారం కూడా న‌డిచింది. కాని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా ఎన్టీఆర్ త‌న త‌ర్వాతి సినిమాను కొర‌టాల‌తో చేయ‌బోతున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు.

త్రివిక్ర‌మ్‌తో సినిమా అనౌన్స్ చేయ‌ని కారణంగా ఎన్టీఆర్ తో మాట‌ల మాంత్రికుడికి పొస‌గ‌డం లేద‌ని పుకార్లు పుట్టించారు. కాని తాజా స‌మాచారం మేర‌కు త్రివిక్రమ్‌- ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా ఆగిపోలేదని, ప్రస్తుతానికి జస్ట్‌ గ్యాప్‌ ఇచ్చారని సమాచారం. కొరటాల, ప్రశాంత్‌ నీల్‌తో సినిమా పూర్తవగానే వెంటనే త్రివిక్రమ్‌తో మూవీ పట్టాలెక్కనుందట. ‘అరవింద సమేత’ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు రెండేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019,2020 కాలెండర్ ఇయర్‌లో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు.ఇపుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2021లో కూడా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనపడటం లేదు. కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడు కాలెండర్ ఇయర్స్‌లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి.