Disha Patani : టేబుల్ ఎక్కి దిశా ప‌టానీ సిస్ట‌ర్స్ ఎంత హంగామా చేశారో చూడండి..!

Disha Patani : లోఫ‌ర్ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని.ఈ సినిమా అమ్మ‌డికి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకురాక‌పోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. ‘ఎం.ఎస్‌.ధోని’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘భాఘీ సిరీస్‌’, ‘మలంగ్‌’, ‘భారత్‌’, ‘రాధే’ సినిమాలతో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

disha patani sister khushboo dance top table
disha patani sister khushboo dance top table

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో ఉండే చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీగానే ఉంది . సినీ రంగంలో అడుగుపెట్టనప్పటికి తన అందం, గ్లామర్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ ఇద్దరూ అక్కాచెల్లెల్లు సోషల్‌ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

వెకేషన్‌లో భాగంగా దిశా పటాని, తన సోదరి కుష్బూ పటానిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం దిశ సోదరి ఖుష్బూ పటానీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్‌డే పార్టీలో ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పార్టీలో టెబుల్‌ పైకి ఎక్కి మరి ఖుష్బు డ్యాన్స్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ వీడియోను దిశ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ హ్యీప బర్త్‌డే మై క్రేజీ సిస్‌, నీలా నేను కూడా డ్యాన్స్‌ చేయాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చింది. సల్మాన్‌, కత్రినా పాటకు ఖష్ఫు తనదైన స్టైల్‌ల్లో స్టెప్పులేసింది ఖష్బు. ఇక ఆమె డ్యాన్స్‌కు కొంతమంది నెటిజన్లు ఫిదా అవుతుండగా మరికొందరూ తమదైన స్టైల్లో విమర్శలు గుప్పిస్తున్నారు.

‘ఛీఛీ.. ఒళ్లు మరిచి ఎలా డ్యాన్స్‌ చేస్తుంది. తనో ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం మరించిందా.. తనేమి హీరోయిన్‌ కాదు.. కొంచం పద్దతిగా ఉండండి’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఖుష్బూప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.