Disha Patani : దిశా పటానీ.! ఇదేం డ్రస్సు పాపా.!
NQ Staff - December 24, 2022 / 11:30 AM IST

Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అంటే ఫ్యాషన్ ఐకాన్ కూడా.! అంతేనా, వస్త్ర సన్యాసం చేయడంలో దిశా పటానీ తర్వాతే ఎవరైనా. ఓ ‘లోదుస్తుల’ సంస్థకు ప్రచారకర్త కూడా అయిన దిశా పటానీ, ఆ దుస్తుల్లో ఎప్పటికప్పుడు హై ఓల్టేజ్ గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ వుంటుంది.
ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా దిశా పటానీ ధరించిన డ్రస్ వైరల్ అయ్యింది. పైన బికినీ, కిందేమో ఓ ట్రౌజర్.. వెరసి, ఇదొక వింత కాస్ట్యూమ్లా కనిపిస్తోంది.
పొరపాటున టాప్ వేసుకోవడం మర్చిపోయిందా.?

Disha Patani Latest Beautiful Photos
బికినీ వేసుకున్నావ్.. ఆ పైన ప్యాంటు ధరించావ్.. పొరపాటున టాప్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నావ్.. అంటూ దిశా పటానీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ ఈ కాస్ట్యూమ్‌తో దిగిన దిశా పటానీ, అలాగే బయటకు వచ్చేసింది కూడా.
దాంతో, విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది దిశా పటానీ. అయినా, ఆమెకు ఇవేం కొత్త కాదు. ఇంతకంటే హాట్ అప్పీల్‌తో చాలా సార్లు దిశా పటానీ బయటకు వచ్చింది.