Mahesh : ‘ఏమాయ చేశావె’ సినిమాని మహేష్ అలా చేజార్చుకున్నాడు.!

NQ Staff - September 19, 2022 / 08:38 AM IST

159398Mahesh : ‘ఏమాయ చేశావె’ సినిమాని మహేష్ అలా చేజార్చుకున్నాడు.!

Mahesh : ‘ఏ మాయ చేశావె’.. తెలుగులో సూపర్ హిట్ సినిమా ఇది. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో సుధీర్‌బాబు ఓ చిన్న పాత్రలో కనిపించిన విషయం విదితమే. అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది ‘ఏ మాయ చేశావె’. ఈ సినిమాతోనే సమంత తెలుగు తెరపై తొలిసారిగా కనిపించింది.

How Mahesh Missed Ye Maya Chesave Movie

How Mahesh Missed Ye Maya Chesave Movie

తెలుగులోనూ అలాగే తమిళంలోనూ ఒకేసారి ఒకే కథతో రెండు వేర్వేరు సినిమాల్ని దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించాడు.గౌతమ్ మీనన్ తొలి హీరో మహేష్.. సూపర్ స్టార్ మహేష్‌బాబుని తొలుత ఈ సినిమా కోసం దర్శకుడు గౌతమ్ మీనన్ సంప్రదించాడు. అయితే, మహేష్ ఈ సినిమాని వదులుకున్నాడు. ‘నీతో చాలా పెద్ద యాక్షన్ సినిమా చేయాలి గౌతమ్.. అదే ప్రేక్షకులు మన కాంబినేషన్ నుంచి ఆశిస్తారు..’ అంటూ మహేష్ చెప్పాడట.

ఈ విషయాన్ని తాజాగా గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో గౌతమ్ మీనన్ కూడా ఒకరు. ఒకవేళ గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే ‘ఏ మాయ ఛేశావె’ సినిమాని మహేష్‌బాబు చేసి వుంటే.. ఆ లెక్క వేరేలా వుండేది.! ప్చ్.. మహేష్ వదులుకున్న ఆ సూపర్ హిట్ ఫిలిం, నాగచైతన్యకు కలిసొచ్చిందన్నమాట.