Disagreements Continue In Manchu Family : మంచు వారి ఫ్యామిలీలో ఇంకా విభేదాలు చల్లారలేదా?

NQ Staff - August 1, 2023 / 12:13 PM IST

Disagreements Continue In Manchu Family : మంచు వారి ఫ్యామిలీలో ఇంకా విభేదాలు చల్లారలేదా?

Disagreements Continue In Manchu Family :

మంచు వారి ఫ్యామిలీలో విభేదాలు తలెత్తిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ ల మధ్య గొడవ జరగడం.. ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకోవడం, ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం అందరికి తెల్సిందే. అయితే ఆ విభేదాలు కొన్ని రోజులే అని ఫ్యామిలీలో అన్ని సర్ధుకుంటాయి అంటూ మోహన్ బాబు అన్నాడు.

మోహన్ బాబు అన్నట్లుగా జరగలేదు. ఇంకా విభేదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మంచు మనోజ్‌ గత కొంత కాలంగా అన్నయ్య విష్ణు తో పాటు తండ్రి మోహన్ బాబుకు కూడా దూరంగా ఉంటున్నాడు అంటూ పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్లకు అదనపు బలం అన్నట్లుగా చంద్రబాబు నాయుడును మనోజ్ దంపతులు కలిశారు.

టీడీపీలోకి మంచు మనోజ్‌…?

Disagreements Continue In Manchu Family

Disagreements Continue In Manchu Family

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మంచు మనోజ్ కలిసి నేపథ్యం లో ఇప్పటికే మంచు వారి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు మరింత పెద్దగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా విష్ణు తనకు బంధువు అయ్యే వైఎస్ జగన్‌ కు సన్నిహితుడిగా కొనసాగుతున్నాడు.

ఈ సమయంలో మనోజ్ వెళ్లి తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయితే కచ్చితంగా ఫ్యామిలీలో విభేదాలు తారా స్థాయి లో ఉన్నట్లే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. మనోజ్‌ పోటీ చేస్తే అక్కడ నుండి విష్ణు ను కూడా వైకాపా నుండి పోటీ చేయిస్తారేమో. అప్పుడు రాజకీయం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us